బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మణికర్ణికా సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. వివాదాల నడుమ ఈ సినిమ భారీ స్థాయిలో 50 దేశాల్లోపైగా విడుదలైన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మణికర్ణికా సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. వివాదాల నడుమ ఈ సినిమ భారీ స్థాయిలో 50 దేశాల్లోపైగా విడుదలైన సంగతి తెలిసిందే. కంగనా కథానాయికగానే కాకుండా చివరలో డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకొని విడుదల చేసిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. మొదట తెలుగు దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు పని చేశాడు.
ఇకపోతే తెలుగులో డబ్ చేసినప్పటికీ సినిమాను ఎక్కువగా విడుదల చేయలేదు. కొనడానికి కూడా బయ్యర్స్ ముందుకు రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం రిలీజైన ఫస్ట్ వీక్ లోనే సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఒక హీరోయిన్ సినిమా మొదటి మూడురోజుల్లో 40 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం ఇదే మొదటిసారి.
మొదటి రోజు 8.75 కోట్లను అందుకున్న ఈ సినిమా సెకండ్ డే అంతకంటే ఎక్కువగా 18.10 కోట్లను వసూలు చేసింది. ఇక మూడవరోజు 15.70 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని మొత్తంగా 42.55 కోట్లను రాబట్టింది. చూస్తుంటే నెక్స్ట్ వీక్ కూడా మణికర్ణిక కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఎనలిస్ట్ లు చెబుతున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ కథను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ రాశారు.
