అవసరం వస్తే మాత్రం కొందరు నటీనటులు సిగ్గు లేకుండా తనకు ఫోన్లు చేస్తుంటారని.. బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. ఇతర నటీనటుల ప్రవర్తన గురించి మాట్లాడింది. అవసరం వస్తే తనకు ఫోన్లు చేసి అడుగుతారని, తనకోసం మాత్రం ఎవరూ ముందుకు రారని
ఫైర్ అయింది కంగనా.

2014లో కంగనా నటించిన 'క్వీన్' సినిమా విడుదలై పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థ క్రెడిట్ మొత్తం తీసేసుకుందని, తన గురించి మాత్రం ఎవరూ మాట్లాడేవారు కాదని చెప్పింది కంగనా. ఎక్కడకి వెళ్లినా.. ఆ సంస్థ తెరకెక్కించిన సినిమాల స్క్రీనింగ్స్ ప్రదర్శించేవారని తన  సినిమాల స్క్రీనింగ్స్ ని ఎవరూ వచ్చేవారు కాదని అన్నారు.

వారికేదైనా.. అవసరం వస్తే మాత్రం సిగ్గు లేకుండా ఫోన్లు చేస్తుంటారని, వారి కోసం సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్లేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. 'రాజి' సినిమా విడుదల సమయంలో అలియా భట్, డైరెక్టర్ మేఘనాలతో అరగంట మాట్లాడానని చెప్పింది. అలియా తనకు ట్రైలర్ లింక్ పంపించి ప్లీజ్ చూడడాని అని రిక్వెస్ట్ చేస్తే చూసి తనను అభినందించినట్లు చెప్పిన కంగనా.. తన సినిమాకు రమ్మని పిలిచినప్పుడు మాత్రం ఎవరూ స్పందిచలేదని చెప్పింది.

అమీర్ ఖాన్ 'దంగల్' సినిమా గురించి మాట్లాడడానికి అంబానీ ఇంటికి వెళ్లారని తెలిసి తను కూడా వెళ్లినట్లు గుర్తు చేసుకున్న కంగనా.. తన సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్ కి మాత్రం ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.