వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు హీరో నాని, దాంతో ఇండస్ట్రీ మొత్తం అతని చుట్టూ తిరుగుతోంది. దానికి తోడు తమిళ మార్కెట్ కూడా అతనికి యాడ్ అవటం కలసి వచ్చింది. ఈ నేపధ్యంలో మణిరత్నం వంటి స్టార్ డైరక్టర్ సైతం నాని డేట్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్దితి. ఆయన గత చిత్రం నవాబ్ లో సైతం నానిని అడిగితే డేట్స్ ఖాళీ లేక ప్రక్కన పెట్టేసాడు. అయితే మణి రత్నం అతన్ని వదిలేలా లేడు.

తన డ్రీమ్ ప్రాజెక్టు  'పొన్నియన్ సెల్వం' కోసం నాని ని అడగటం జరిగింది. నాని సైతం ఈ సారి అంత పెద్ద దర్సకుడు ప్రాజెక్టు వదులుకోవాలని లేదు. దాంతో బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. నిజానికి  మణిరత్నం ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకుంటున్న 'పొన్నియన్ సెల్వం' నవలా చిత్రానికి తారాగణం సెట్ కాకపోవడం వల్లే ఇంత వరకూ సెట్స్ మీదకు వెళ్ళలేకపోయింది.

గతంలో ఈ సినిమాని మహేష్ బాబుతో తెరకెక్కించాలని ప్రయత్నించాడు మణిరత్నం.  అయితే బల్క్ డేట్స్ ఇవ్వాల్సిరావడం వల్లనో ఏమో, ఎవరూ ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించలేదట. దాంతో ఆ ప్రయోగాన్ని విరమించుకున్నాడు మణిరత్నం. 'బాహుబలి' తర్వాత ఇండియన్ సినిమా మార్కెట్ పెరగడంతో మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరపైకి తీసుకోచ్చే ప్రయత్నం చేస్తున్నాడాయన. అందులో భాగంగానే మణిరత్నం ఈ సినిమా కోసం నాని ను లైన్లో పెట్టాడని కోలీవుడ్ టాక్.

మహేశ్ బాబుతో 'పొన్నియన్ సెల్వం' తెరకెక్కించే ప్రయత్నం ముందుకు వెళ్లకపోవటంతో.. ఆ తర్వాత తమిళ స్టార్ హీరోలు విజయ్,విక్రమ్,శింబు లతో చర్చలు జరిపాడు మణిరత్నం. అమితాబ్ , ఐశ్వర్యారాయ్ లను సైతం ఓకే చేసుకున్నాడు. తెలుగు నుంచి నానిని ఈ సినిమాలోకి తీసుకున్నారు. విక్రమ్ ప్రస్తుతం 'మహావీర్ కర్ణ' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత 'పొన్నియన్ సెల్వం' సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.