వంద మందిని పంపించినా అందరినీ పగల గొడతా- ఫిదా గాయత్రి

First Published 28, Dec 2017, 9:40 PM IST
maneesha gayatri sharanya rocks in etv na show na ishtam by chanti
Highlights
  • ఇటీవల కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలతో సంచలనంగా మారిన ఫిదా గాయత్రి
  • 12 రోజులు పడుకుంటే తనకు కార్ ఫ్లాట్ ఛాన్స్ ఇస్తామన్నారంటూ సంచలన ఆరోపణలు
  • తాజాగా ఈటీవీ నా షో నా ఇష్టంలో పాల్గొని తెగ ఫన్ క్రియేట్ చేసిన గాయత్రి

ఈ కార్యక్రమంలోని పాత్రలు మరియు సన్నివేశాలు కల్పితాలు మాత్రమే. ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు. కించపరచడానికి కాదు. ఇది కేవలం వినోదానికి మాత్రమే. చూసి ఆనందించగలరు. ఈ టీవీ ప్లస్ లో ప్రముఖ తెలుగు యాక్టర్, యాంకర్ కమ్ ఎంటర్ టైనర్ చంటి నిర్వహించే నా షో నా ఇష్టం షో మొదలయ్యే ముందు మనకు చూపించే లైన్స్ ఇవి. ఇలాంటి లైన్లను చాలా టీవీ షోలు ఈ మధ్య తమ షో మొదలయ్యే ముందు వేసి ఆగ్రహించే  వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇక ఈ వారం ప్రసారమైన నాషో నాఇష్టం కార్యక్రమం సాధారణంగానే ప్రేక్షకులను అలరించిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా డిసెంబర్ 23న అప్ లోడ్  చేసిన షోలో నా సెలెబ్ నా ఇష్టం సెగ్మెంట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ షోలో ఫిదా పేం శరణ్య, సింగర్ మనీషా, ఫిదా ఫేం గాయత్రి సెలెబ్రిటీ గెస్టులుగా వచ్చారు.

 

ముందుగా కోడి కూర చిల్లు గారి, కోరి వడ్డించిపోవె ఒక్కసారి పాటకు డాన్స్ వేసి అలరించిన శరణ్య.. పొట్టి నరేష్ తో చేసిన కామెడీ ఫన్ ఆకట్టుకుంది. నా కోసం ఇంత అందమైన అమ్మాయి డాన్స్ వేసిందంటే.. అంటూ నరేష్ కామెంట్ చేయగా.. శరణ్య కౌంటర్ దిమ్మతిరిగేలా ఇచ్చింది. నువ్వు అడ్డమొస్తున్నవని నేను అలా వూపా. ఎనకాల పోతె ఏడ కనపడుతవు నాకు అంటూ సెటైర్ వేసింది.

ఆ తర్వాత వచ్చిన సింగర్ మనీషా.. గోంగూర తోట కాడ కాపుకాసా... అంటూ సాగే రవితేజ వెంకీలోని మాస్ మసాలా సాంగ్ కు క్యూట్ స్టెప్స్ వేసి అలరించింది. నరేష్ మళ్లీ నా కోసం మనీషా డాన్స్ అంటూ ఫీలైపోతుంటే.. తమ్ముడూ.. నువ్వు డాన్స్ చేయమంటే.. బీట్ ఒకటి స్టెప్ ఒకటి.. ఏం డాన్స్ తమ్మీ అంటూ కౌంటర్ ఇచ్చి సూపర్ ఫన్ క్రియేట్ చేసింది.

ఇక ఆ తర్వాత వచ్చిన ఫిదా ఫేం గాయత్రి జై లవకుశ స్వింగ్ జరా తమన్నా సాంగ్ కు స్టెప్స్ వేసి ఎంట్రీ ఇచ్చింది. పొట్టి నరేష్ కు కూడా క్యూట్ గా డాన్స్ చేశావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. దాంతో గిచ్చండి అనగానే బుగ్గ గిల్లి మరీ..నేను నీలా పొట్టిగా లేనని బాధపడుతున్నానంటూ పొగిడేసింది గాయత్రి. దీంతో మనోడు తొడగొట్టకుండా వుంటాడా. కొట్టేశాడు.

 

ఇంతలో చంటి ముగ్గురు అందమైన అమ్మాయిలు సెపరేట్ గా డాన్స్ చేయటం కాదు. కలిసి డాన్స్ చేయాలంటూ ఫిదా మెల్లామెల్లగ వచ్చిండే సాంగ్ ప్లే చేయటం.. ముగ్గురూ స్టెప్స్ తో అదరగొట్టడం జరిగిపోయింది. ఇక నరేష్ తనను ఇంప్రెస్ చేసిన గాయత్రికి షో థీమ్ ఎక్స్ ప్లెయిన్ చేస్తుంటే... చంటి వెనకనుంచి వాయించేశాడు. శరణ్య పోయేలోపు పెండ్లి చేస్త అనగానే.. నాక్కావాల్సింది కూడా అదే అంటూ నరేష్ నవ్వులు పూయించాడు.

ఇక డైలాగ్స్ రౌండ్  మొదలు కాగానే పవన్ కల్యాణ్ కిక్కే వేరప్పా డైలాగ్ చెప్పేసింది. గాయత్రి ఎవడు గుద్దుతె దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయితదో ఆడే గాయత్రి గాడు అంటూ మహేష్ పండుగాడు డైలాగ్ చెప్పింది. సింగర్ మనీమా కూడా పవన్ కల్యాణ్ డైలాగ్ అందుకుంది. నాక్కొంచెం లెక్కుంది. నీక్కొంచెం తిక్కుంది. అంటూ డైలాగ్ చెప్పింది. గాయత్రి నాకు తిక్క,లెక్క రెండూ లేవు అంది. నువ్వు చెప్పావు కాబట్టి  అది కూడా డైలాగే అంటూ మరోసారి నరేష్ నవ్వులు పూయించాడు. ఇంతలో శరణ్య నాకు ఎమోషన్లు లేవు అంటూ డైలాగ్ చెప్తుంటే.. గాయత్రి అవును మోషన్స్ తప్ప ఎమోషన్స్ లేవు అంటూ పంచ్ వేసింది. మనీషా నీట్ గా “పైసల్లేవ్. జ్ఞానమిస్తున్నవ్ గదా.. పుక్కట్ల నేనేం దీస్కోను.” అంటూ ఫిదా డైలాగ్ చెప్పేసింది. అదే తను అమెరికాలో పుట్టిపెరిగిన ఇంగ్లీష్ లో అయితే.. అనగానే.. ఇంగ్లీష్ లో చెప్పి ఆకట్టుకుంది మనీషా. శరణ్య వెళ్లవయ్యా వెళ్లూ వెళ్లూ...అంటూ చివర్లో దొబ్బెయ్ ఈడికెలి అనంగానే అదేందంటూ చంటి అడగ్గా... మా డైలాగ్ మా ఇష్టం అంటూ శరణ్య పంచ్ వేసింది.

అనంతరం మళ్లీ రూల్స్ మార్చి మనీషాకు సాంగ్ పాడాలని, గాయత్రి, శరణ్య డైలాగ్ చెప్పాలని చంటి అడిగాడు. గాయత్రి నుంచి రౌండ్ మొదలైంది. వెంటనే మగధీర లోని ఒక్కొక్కన్ని కాదు షేర్ ఖాన్ డైలాగ్ అందుకుంది గాయత్రి. కానీ డైలాగ్ తనదైన శైలిలో చెప్పింది. ఒక్కడు గాదు షేర్ ఖాన్.. వంద మందిని పట్క రా. అందర్ని పలగ్గొట్టి పంపిస్తా. అంటూ గాయత్రి తనదైన స్టైల్ లో డైలాగ్ పేల్చటంతో నవ్వులే నవ్వులు. ఆ తర్వాత శరణ్య రజినీ పందులే గుంపుగా వస్తయ్ డైలాగ్ అందుకుంది. సింహం ఇక్కడ అంటూ తన స్టైల్లో చెప్పేసింది.

అనంతరం నా బొమ్మ నాఇష్టం రౌండ్ లో గాయత్రి, మనీషా ఆలింగనం చేసుకున్న పోజ్ లో శరణ్య వేసిన పెయింటింగ్, శరణ్య బొమ్మ అంటూ షోలో హైలెట్ గా నిలిచింది. మొత్తానికి నా షో నా ఇష్టం అంటూ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి షోను చాలా ఫన్నీగా రూపొందించారు.

 

loader