బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన మందిరాబేడి. సినిమాల కన్నా, సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలతోనే ఎక్కువగా మందిరా బేడీ పేరుతెచ్చుకుంది. ఆమె ఈ మధ్యన  తెలుగు సినిమా కమిటైందని సమాచారం. ఇప్పటికే  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తోంది. తాజాగా పూరీ జగన్నాథ్ టీమ్‌తో కలిసి కనిపించింది.  ప్రస్తుతం  పూరీ రూపొందిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో కనిపించబోతోంది అనుకుంటున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆకాష్ పూరీ ...హీరోగా చేస్తున్న 'రొమాంటిక్‌'లో కానీ మందిరా బేడీ నటించనుందనీ తెలుస్తోంది. 

ఇక పూరీ జగన్నాధ్‌ తన టీమ్ తో కలిసి  ప్రస్తుతం గోవాలో ఉన్నారు. పూరీ డైరక్షన్ లో  తెరకెక్కిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. అక్కడే  పూరీ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా, పూరీ కథ, స్క్రీన్‌ప్లేతో రూపొందుతోన్న 'రొమాంటిక్‌' మూవీ కూడా అక్కడే షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' అండ్‌ 'రొమాంటిక్‌' టీమ్స్‌ కలిసి సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిల్లో మందిరాబేడీ కనిపించింది. 

ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ పూరి, తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి గుర్తింపు తీసుకురాకపోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోసారి పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తూ ‘రొమాంటిక్‌’ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాతో అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాష్‌కు జోడిగా కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. కేతిక శర్మ అనే మోడల్‌ ఆకాష్‌ సరసన హీరోయిన్‌గా నటించనుందని తెలిపారు.