Asianet News TeluguAsianet News Telugu

`మా` బైలాస్‌లో మార్పులకు మంచు విష్ణు సన్నాహాలు.. ఇకపై సభ్యత్వం తీసుకోవాలంటే కండీషన్స్ అప్లై..?

`మా` ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో `మా` అధ్యక్షుడు మంచు విష్ణు సరికొత్త సంచలనాలకు తెరలేపబోతున్నారు. ఏకంగా ఆయన `మా` బైలాస్‌నే మార్చబోతున్నారు. 

manchu vishnu wants to change maa by-laws
Author
Hyderabad, First Published Oct 18, 2021, 3:33 PM IST

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు అనేక కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ఎన్నడూ లేని విధంగా Maa Election టాలీవుడ్‌లో దుమారం రేపితే, ఆ తర్వాత పరిణామాలు సంచలనాలకు దారితీస్తున్నాయి. ఏకంగా చిరంజీవి, మోహన్‌బాబు మధ్య వివాదాలకు కారణమయ్యాయి. ఇండస్ట్రీలో సర్వత్రా దీని గురించే చర్చ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో `మా` అధ్యక్షుడు మంచు విష్ణు సరికొత్త సంచలనాలకు తెరలేపబోతున్నారు. ఏకంగా ఆయన `మా` బైలాస్‌నే మార్చబోతున్నారు. 

`మా` కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం Manchu Vishnu ప్యానెల్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవిద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇందులో ప్రధానంగా Maa By-lawsకి సంబంధించి చర్చకు వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. చాలా విషయాల్లో బైలాస్‌ని మార్చాలనుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి అందులో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ మున్ముందు మార్పులు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. 

related news:పవన్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్.. వీడియోలో చూసింది నిజం కాదు.. మంచు విష్ణు క్లారిటీ..

ఎవరు పడితే వారు `మా` సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు మంచు విష్ణు. అయితే బైలాస్‌ మార్చడం ఈజీ కాదని, దీనిపై పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరు పడితే వాళ్లు `మా` సభ్యులు కాకూడదని తెలిపారు. బైలాస్‌కి సంబంధించి, మన `మా` బైలాస్‌ని, అలాగే తమిళంకి చెందిన నడిగర్‌ సంఘం బైలాస్‌ని, కన్నడ, మలయాళం, హిందీ, ఇతర దేశాల ఆర్టిస్టుల అసోసియేషన్‌కి సంబంధించిన బైలాస్‌లని చదవి, ఫైనల్‌గా మన తెలుగు వారికి ఎలా ఉంటే మేలు జరుగుతుందో ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. పెద్దల అంగీకారం మేరకే జరుగుతుంది. మార్చే హక్కు, స్వేచ్ఛ తనకు ఉందని చెప్పారు మంచు విష్ణు. ఇకపై `మా`సభ్యత్వం తీసుకోవాలంటే కండీషన్స్ అప్లై అని చెప్పబోతున్నాడు మంచు విష్ణు.

also read: ప్రకాష్ రాజ్ కు షాక్.. నేను రాను, కోర్టుకి వెళ్ళమంటున్న ఎన్నికల అధికారి

అదే సమయంలో బైలాస్‌ మార్చినా, ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎలాంటి మార్పులుండవన్నారు. `మా` సభ్యుల్లో ఎవరైనా ఏ పదవికైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. అది మన ప్రజాస్వామ్య హక్కు అని తెలిపారు. మరోవైపు రాజకీయాల్లోకి రావడంపై ఆయన స్పందిస్తూ, తనకు ఆ ఆలోచన లేదన్నారు. మంచు విష్ణు..గత ఆదివారం జరిగిన `మా` ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌పై గెలిచిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios