మంచు వారి సినిమాల హడావుడి గత కొంత కాలంగా తగ్గిపోతూన్నట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు సినిమాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. ఇక మంచు మనోజ్ లాగ్ బ్రేక్ తీసుకుంటున్నట్లు ముందే చెప్పేశాడు. మంచు లక్ష్మి ఇక ఎప్పుడు ఎలాంటి సినిమాతో వచ్చినా మెరుపు తీగల వెళ్ళిపోతోంది, ఇక అన్నయ్య మంచు విష్ణు కూడా మంచి సినిమాతో రావాలని గ్యాప్ చాలానే తీసుకున్నాడు. 

గతంలో మంచు వారి ప్రొడక్షన్స్ నుంచి కనీసం ఒక్క సినిమా అయినా వచ్చేది. కానీ వరుస డిజాస్టర్స్ తో ఇప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు. అసలు విషయంలోకి వస్తే ఆగిపోయింది అనుకున్న మంచు విష్ణు ఓటర్ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అడ్డా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

రీసెంట్ గా ఇచ్చిన ప్రెస్ నోట్ లో సినిమా షూటింగ్ పూర్తయినట్లు చెబుతూ ప్రస్తుతం ఓటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులల్లో బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమిళ్ లో కూడా సినిమాను తెరకెక్కించారు. ఎన్నికల మూమెంట్ లో ఈ పొలిటికల్ సినిమాను విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నారు. మరి మంచు విష్ణు ఈ సినిమాతో ఎంతవరకు హిట్టందుకుంటాడో చూడాలి.