ఏపీ ఎన్నికల్లో ఫ్యాన్ తన జోరు చూపించింది. వైసీపీ ప్రభంజనంతో టీడీపీ ఘోరపరాజయంపాలయ్యింది. మొత్తంగా 151 సీట్లు గెలుచుకోగా.. టీడీపీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. ఇంత దారుణంగా టీడీపీ ఓడిపోవడం ఆ పార్టీ తట్టుకోలేకపోతుంది.

ఇప్పటికీ ఆ షాక్ లోనే ఉన్నారు. ఇప్పటికే బాధలో ఉన్న వారిని వైసీపీ అభిమానులు, నేతలు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబుపై హీరో మంచు విష్ణు ట్విట్టర్ లో సెటైర్లు వేస్తూ పోస్ట్ పెట్టారు. తన ట్వీట్ లో నారాకి కొత్త అర్ధం చెప్పారు.

NARA అంటే.. (నేషనల్ యాంబిషన్..రీజనల్ ఆస్పిరేషన్స్..)జాతీయ స్థాయిలో ఆశయం, ప్రాంతీయ స్థాయిలో ఆకాంక్షలు అంటూ అర్ధం చెబుతూ.. నాకు బలమైన భావన ఉంది.. మన ప్రియమైన ప్రధాని నరేంద్రమోదీజీ ఎవరిని ఇలా ట్రోల్ చేశారో.. మనకూ తెలుసు అంటూ రాసుకొచ్చారు. నారా పేరుతో ప్రధాని కొత్త స్లోగన్ తో ముందుకొస్తే.. దానిని చంద్రబాబుకి లింక్ పెడుతూ విష్ణు వెటకారం చేసినట్లు కనిపిస్తోంది.

మొదటి నుండి మంచు ఫ్యామిలీ వైసీపీ పార్టీకి మద్దతు పలుకుతోంది. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.