మంచు విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప. పలువురు స్టార్స్ భాగమైన ఈమూవీ విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. అయితే పుష్ప 2తో కన్నప్ప పోటీపడే సూచనలు కనిపిస్తున్నాయి..
మంచు విష్ణుకి అర్జెంట్ గా హిట్ కావాలి. ఆయన క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు గడచిపోయింది. వరుస పరాజయాలతో మార్కెట్ దెబ్బతింది. మంచు విష్ణు గత చిత్రం జిన్నా, పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసేందుకు నానా తిప్పలు పడింది. పట్టువదలని విక్రమార్కుడిలా మంచు విష్ణు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
కన్నప్ప భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ పీరియాడిక్ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. ఈ స్టార్స్ గెస్ట్ రోల్స్,ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. కన్నప్ప మెజారిటీ చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరుగుతుంది. షిప్పులో చిత్రీకరణకు కావలసిన ప్రాపర్టీస్ ఆ దేశానికి తరలించారు. కన్నప్ప బడ్జెట్ రూ. 60 కోట్లకు పైమాటే అంటున్నారు.
ప్రస్తుతం మంచు విష్ణుకు ఉన్న మార్కెట్ రీత్యా ఆ స్థాయిలో బిజినెస్ చేయడం, వసూళ్లు రాబట్టడం అంత సులభం కాదు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కానీ కన్నప్ప రికవరీ కాలేదు. ఇటీవల కన్నప్ప టీజర్ విడుదల చేశారు. లొకేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, మంచు విష్ణు గెటప్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ లుక్ కూడా సుచాయిగా రివీల్ చేశారు.
కాగా కన్నప్ప విడుదల పై మంచు విష్ణు ప్రకటన చేశారు. 2024 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టత ఇచ్చాడు. అదే నెలలో పుష్ప 2 విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 24న పుష్ప 2 పలు భాషల్లో రిలీజ్ కానుంది. మంచు విష్ణు ప్రకటన నేపథ్యంలో పుష్ప 2, కన్నప్ప బాక్సాఫీస్ వద్ద ఢీకొంటాయా... అనే సందేహాలు కలుగుతున్నాయి. డిసెంబర్ లో విడుదల అని చెప్పిన మంచు విష్ణు తేదీ పై స్పష్టత ఇవ్వలేదు. అయితే పుష్ప 2తో పోటీపడే సాహసం మంచు విష్ణు చేయకపోవచ్చు. బహుశా మొదటివారంలో ఆయన రిలీజ్ ప్లాన్ చేసి ఉండొచ్చు.. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు.
