తెలంగాణాలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యల అంశం దుమారం రేపుతోన్న తరుణంలో కేసీఆర్ కి మంచు విష్ణు తన సపోర్ట్ అందించారు. ఇంటర్మీడియట్ బోర్డ్ తప్పిదాల కారణంగా జరిగిన అనర్ధాలకు బాధ్యత ప్రభుత్వానిదే అంటూ ఆరోపిస్తున్నారు.

అయితే ఈ విషయంలో స్పందించిన కొందరు హీరోలు విద్యార్ధులను ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేదు. దీంతో సోషల్ మీడియాలో సినీ హీరోలపై విమర్శలు మొదలయ్యాయి. వారు కేసీఆర్ కి భయపడుతున్నారని కామెంట్స్ చేశారు.

ఈ ఆరోపణల్లో నిజం లేదని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తప్పిదాల కారణంగా ఇరవై మంది తమ్ముళ్లను, చెల్లెళ్ళను కోల్పోవడం దురదృష్టకరమని, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు విమర్శించాలని, మనం ప్రజాస్వామ్యంలో బతుకున్నట్లు చెప్పారు.

కేటీఆర్ చాలా చురుకైన, విద్యార్ధుల కోసం పని చేసే రాజకీయ నాయకుడని అన్నారు. కేసీఆర్ గారు ఫైర్ బ్రాండ్ అనే విషయం అందరికీ తెలిసిందేనని.. కానీ ఆయన డిక్టేటర్ కాదని అన్నారు. తెలంగాణా ప్రభుత్వాన్ని నింధించడానికి బదులు, దీని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించాలని అన్నారు. కేసీఆర్ గారిని సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు  భయపడుతున్నారని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయని.. కానీ అందులో నిజం లేదని అన్నారు.