టాలీవుడ్ స్టార్ హీరోల గ్రూప్ నుంచి బయటకు వచ్చాడు మంచు విష్ణు. స్టార్ హీరోలంతా ఏర్పాటు చేసుకున్న వాట్సప్ గ్రూప్ నుంచి మంచు వారి హీరో ఎందుకు బయటకు వచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు.

టాలీవుడ్ హీరోలంతా చాలా స్నేహంగా ఉంటారు. కొంత మంది మధ్య సినిమాల పరంగా విభేదాలు ఉన్నా.. పర్సనల్ గా మాత్రం చాలా సఖ్యతతో ఉంటారు. వీరంతా కలిసి ఒక వాట్సప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారు. తాజాగా ఆ గ్రూప్ గురించి మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ల వాట్సప్ గ్రూప్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న స్టార్ హీరోలు, హీరోయిన్లకు ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఉందన్న విషయం మీకు తెలుసా? అవును ఈ గ్రూప్ ను చాలా జాగ్రత్తగా స్టార్ హీరోలు మెయింటేన్ చేస్తున్నారు. అందులో దాదాపు 140 మంది స్టార్స్ ఉన్నారు. ఈ విషయం గురించి గత ఇంటర్వ్యూలలో హీరోలు నాని, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి వంటి పలువురు స్టార్లు వెల్లడించారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ గ్రూప్‌లో యంగ్ స్టార్స్ తో పాటు కొంత మంది సీనియర్ స్టార్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ గ్రూప్‌ను ప్రముఖ హీరోలు రానా దగ్గుబాటి , అల్లు అర్జున్ కలిసి ప్రారంభించినట్టు సమాచారం. ఈ గ్రూప్‌లో సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు, కొత్త సినిమాల గురించి, షూటింగ్ అప్‌డేట్స్ వంటి అంశాలు షేర్ చేసుకుంటుంటారు. అయితే ఈ గ్రూప్ లో మంచు హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ గ్రూప్ లో యాక్టీవ్ గా ఉండేవారు.

స్టార్స్ వాట్సప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన విష్ణు.

ఇక తాజాగా మంచు విష్ణు ఈ టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నప్ప సినిమా ప్రమోషన్స్ సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.వాట్సప్ గ్రూప్ నుంచి తాను ఎందుకు బయటకు రావల్సి వచ్చిందో వివరించాడు.

మంచు విష్ణు మాట్లాడుతూ, టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్‌ను రానా, బన్నీ (అల్లు అర్జున్) కలిసి స్టార్ట్ చేశారు. నేను కూడా ఆ గ్రూప్‌లో ఉండేవాడిని. కానీ అందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లతో ఒకే గ్రూప్‌లో చాట్ చేయడం నాకు చాలా సిగ్గుగా అనిపించేది. అందుకే ఆ గ్రూప్‌ నుంచి బయటకు వచ్చేశాను, అని అన్నారు.

అలాగే, నాకు ఎవరైనా ఏదైనా చెప్పాలంటే నేరుగా మెసేజ్ చేయమని రానా, బన్నీకి చెప్పాను. మేమంతా చిన్ననాటి నుంచి కలిసే పెరిగాం. ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాం. ఆ బాంధవ్యానికి గ్రూప్ అవసరం లేదు, అని తెలిపారు.టాలీవుడ్ స్టార్స్ మధ్య ఉన్న స్నేహం, గురించి చెప్పే సందర్భంలో, మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంచు విష్ణు కన్నప్ప సినిమా అప్ డేట్

కన్నప్ప సినిమా కోసం దేశమంతా తిరుగుతున్నాడు విష్ణు. ఈ ప్రమోషన్స్ సాగుతున్న నేపథ్యంలో, మంచు విష్ణు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోసారి టాలీవుడ్ హీరోల మధ్య స్నేహానికి ఈ కామెంట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతే కాదు కన్నప్ప సినిమా కోసం స్టార్ హీరోలు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ అయితే కోట్లు విలువ చేసే కాల్షీట్స్ ను ఫ్రీగా ఇచ్చేశాడు. 

ఇక కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు మంచు విష్ణు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ బాలీవుడ్ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం కన్నప్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈనెల 27న కన్నప్ప సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.

కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్స్

మంచు ఫ్యామిలీ కన్నప్ప సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాలో పాన్ ఇండియా నుంచి ఎంతో మంది స్టార్స్ నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ అయితే దాదాపు 40 కోట్ల విలువైన కాల్ షీట్స్ ను ఫ్రీగా ఇచ్చేశాడు. అటు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, జయరాం, కన్నడ నుంచి కూడా సీనియర్ స్టార్స్ ఈసినిమాలో నటించారు. దాదాపు షూటింగ్ అంతా న్యూజిలాండ్ లోనే కంప్లీట్ చేసుకున్నారు టీమ్. అక్కడి అందమైన లొకేషన్స్ లో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కన్నప్ప సినిమాతో మంచు ఫ్యామిలీ నుంచి తేరంగేట్రాలు

కన్నప్ప సినిమాను మంచు ఫ్యామిలీ ప్రస్టేజియస్ గా తీసుకుంది. మంచు మోహన్ బాబు దగ్గరుండి ఈసినిమాను పర్యావేక్షించారు. ఈసినిమాలో ఓ పాత్రలో కూడా ఆయన కనిపించారు. ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు వారి ఫ్యామిలీ నుంచి స్టార్స్ లేకుంటే ఎట్ల. ఎలాగు మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు, మెహన్ బాబు మంచి పాత్రోలో కనిపించబోతున్నారు. ఇక వీరు కాకుండా మంచు విష్ణు వారసులు కూడా రంగంలోకి దిగారు. ఈమూవీలో ఓ పాటతో ఆయన కూతుర్లు అరియాన , వివియానాలు స్క్రీన్ కు పరిచయం అయ్యారు. ఈపాట అద్బుతంగా వచ్చింది. ఇక కన్నప్ప సినిమాలో జూనియర్ కన్నప్ప పాత్రలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ పరిచయం కాబోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంచు విష్ణు. ఆ వీడియోకు ఎమోషనల్ కామెంట్స్ కూడా జత చేశారు.