ప్రకాష్‌ రాజ్‌(prakash raj) గత నెలలోనే తన ప్యానెల్‌(panel)ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో పోటీదారు మంచు విష్ణు(manchu vishnu) కూడా ప్యానెల్‌ని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. బుధవారం తన ప్యానెల్‌తో ఆయన మీటింగ్‌ నిర్వహించారు.

`మా` ఎన్నికలు గత రెండు నెలలుగా టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. `మా` అధ్యక్షుడి కోసం తీవ్ర పోటీ నెలకొంది. విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహారావు అధ్యక్షుడి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు బండ్ల గణేష్‌ ఇండిపెండెంట్‌గా జనరల్‌ సెక్రెటరీగా పోటీలో ఉన్నారు. అక్టోబర్‌ 10 మా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. అయితే ప్రకాష్‌ రాజ్‌ గత నెలలోనే తన ప్యానెల్‌ని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో మరో పోటీదారు మంచు విష్ణు కూడా ప్యానెల్‌ని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. బుధవారం తన ప్యానెల్‌తో ఆయన మీటింగ్‌ నిర్వహించారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. రేపు(గురువారం) ఉదయం 11గంటలకు తన ప్యానెల్‌ని ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. అయితే తాను మీటింగ్‌ అయిన వారిలో ప్రస్తుత `మా` అధ్యక్షుడు నరేష్‌, బాబు మోహన్‌, శివ బాలాజీ, మాదాల రవి, రఘుబాబు, గౌతమ్‌లున్నారు. రేపు టోటల్‌ ప్యానెల్‌పై క్లారిటీ రానుంది. ఇందులో రఘుబాబు జనరల్‌ సెక్రెటరీకి, బాబూ మోహన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్ పోస్ట్ కి పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. 

Scroll to load tweet…