మంచు విష్ణు ‘కన్నప్ప’.... మరోసారి షూటింగ్ కు బ్రేక్.. ఈసారి ఏమైందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్తకన్నప్ప’ షూటింగ్ మరోసారి బ్రేక్ లు పడ్డాయి. మళ్లీ ప్రమాదం జరగడంతో ఆగిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు.
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) తన కలల ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టులోనే ఈ పాన్ ఇండియా మూవీ శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా మొదలైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా షూటింగ్ కు మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohanlal) కూడా హాజరైనట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ కు అప్పుడప్పుడు బ్రేక్ లు పడుతున్నాయి.
ఇప్పటికే విష్ణు షూటింగ్ లో గాయపడ్డి షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మూడునాలుగురోజుల గ్యాప్ తర్వాత మళ్లీ షూరు చేశారు. ఆ తర్వాత షూటింగ్ కు బ్రహ్మానందం, సురేఖవాణి, తదితరులు హాజరయ్యారు. ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్న షూటింగ్ కు మళ్లీ బ్రేక్ లు పడ్డట్టు తెలుస్తోంది. ఈసారి కారణంగా ఏంటంటే... సాంగ్ షూటింగ్ చేస్తుండగా కొరియోగ్రఫర్ కు గాయమవడమే..
లేడీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ సాంగ్ ను షూట్ చేస్తున్న సమయంలో కాలు బెనికింది. దీంతో ఆమెను డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఆ సాంగ్ షూట్ ను ఆపేసినట్టు తెలుస్తోంది. మిగితా షూటింగ్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ ను మోహన్ లాల్ పై షూట్ చేయాల్సి ఉందంట. మాస్టర్ కు కాలు సెట్ అయ్యాక మళ్లీ షూట్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
ఇక మోహన్ లాల్ సెట్ కు హాజరైన సందర్భంగా యూనిట్ న్యూజిలాండ్ స్పెషల్ హకా డాన్స్ తో స్వాగతం పలికారు. ఇప్పటికే శరత్ కుమార్, బ్రహ్మానందం, సురేఖ వాణి తమ షూటింగ్ అండ్, టాకీ పార్ట్ ను కంప్లీట్ చేశారని తెలుస్తోంది. ‘భక్తకన్నప్ప’ చిత్రాన్ని కూడా పూర్తిగా న్యూజిలాండ్ లోనే షూట్ చేయనున్నారు. విష్ణు బర్త్ డే స ందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో నెక్ట్స్ అప్డేట్స్ పై ఆసక్తి నెలకొంది.
పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో భారీ కాస్ట్ ను ఎంపిక చేశారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో అవా ఎంటర్ టైన్ మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై పాన్ ఇండియా ఫిల్మ్ గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. మహాభారత సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. చిత్రంలో నయనతార, అనుష్క కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ కు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.