మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని విష్ణు దృఢ సంకల్పంతో ఉన్నాడు. 

మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని విష్ణు దృఢ సంకల్పంతో ఉన్నాడు. సినిమా ప్రారంభమైన రోజు నుంచే విభిన్నమైన ప్రమోషనల్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఆ మధ్యన విడుదలైన జిన్నా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకుడు. జిన్నా షూటింగ్ అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మంచు విష్ణు జిన్నా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా వెల్లడించాడు. 

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ షూటింగ్ జరుగుతున్న టైంలో విష్ణు కాలికి గాయం అయింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఈ గాయం అయింది. విష్ణు మోకాలి పై భాగం బాగా కమిలిపోయి కనిపిస్తోంది. 'డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇలా గాయపడతానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ విష్ణు పోస్ట్ చేశాడు. 

విష్ణు కనీసం రెండు వారాల విశ్రాంతి తర్వాత మాత్రమే తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోన వెంకట్ ఈ చిత్రానికి రచయితగా పనిచేస్తున్నారు. బోల్డ్ అండ్ హాట్ బ్యూటీస్ సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మా ప్రెసిడెంట్ గా ఎన్నికైన విష్ణు హీరోగా కూడా సాలిడ్ హిట్ అందుకోవాలని జిన్నాతో గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఫన్ అండ్ రొమాన్స్ తో ఈ మూవీ కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.