Asianet News TeluguAsianet News Telugu

సైలెంట్ గా ఓటీటీలోకి మంచు విష్ణు జిన్నా మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇలా రిలీజ్ అవుతున్నాయో లేదో... అలా ఓటీటీల్లోకి చేరిపోతున్నాయి టాలీవుడ్ సినిమాలు. ఆ కోవలోనే సైలెంట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కబోతోంది మంచు విష్ణు జిన్నా మూవీ. 
 

Manchu Vishnu Ginna Movie OTT Streaming
Author
First Published Dec 1, 2022, 10:03 PM IST

అడపా దడపా సినిమాలు చేసుకుంటూ.. నేనున్నాను అని అనిపించుకుంటున్నాడు మంచు విష్ణు. మా అసోషియేష అధ్యక్షుడిగా ఉండి... సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తూ వస్తున్నాడు. సక్సెస్.. ఫెయిల్యూర్ కు సబంధం లేకుండా.  డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నాడు.  ఇక  మంచు విష్ణు  నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన  ఈసినిమా.. దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది.  

అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈసినిమాకు గ్యాంగ్ స్టర్ గంగరాజు ఫేమ్  ఈషాన్ సూర్య  జిన్నా సినిమాకు దర్శకులుగా ఉండగా..  కథను జి.నాగేశ్వర రెడ్డి, మాటలు స్క్రీన్ ప్లే కోన వెంకట్ అందించారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్.. హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అయిన జిన్నా మూవీ.. కాస్త పర్వేలేదు అనిపించింది. 

ఇక ఈ క్రమంలో.. ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది జిన్నా మూవీ. జిన్నా  డిజిటల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ వచ్చింది. ఇక  మొత్తానికి ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ  జిన్నా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇక డిసెంబర్ 2 నుండి జిన్నా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే పెద్దగా ప్రచారం లేకుండానే జీన్నా మూవీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కాబోతోంది. 

హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ను అందించిన ఈమూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేఅవకాశం ఉంది. తెలుగుతో పాటు.. మలయాళ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది. మరి ఓటీటీలో ఈమూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios