Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు పవర్ ఫుల్ డెసిషన్.. 'మా' అధ్యక్షుడిగా తొలిసారి..

'మా'లో మహిళా సభ్యులకు ఇది గుడ్ న్యూస్. 'మా'లో మహిళా భద్రత, సాధికారతను పెంచేందుకు ఓ కమిటీని నియమించబోతున్నట్లు విష్ణు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

Manchu Vishnu first decision as MAA president
Author
Hyderabad, First Published Oct 22, 2021, 8:11 PM IST

రణరంగాన్ని తలపిస్తూ జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు.ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా 'మా' లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు జరిగిన విధానంపై అభ్యంతరం చెబుతూ ప్రకాష్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. వివాదాలు కాస్త పక్కన పెడితే.. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలిసారి పవర్ ఫుల్ డెసిషన్ తీసుకున్నారు. 

'మా'లో మహిళా సభ్యులకు ఇది గుడ్ న్యూస్. 'మా'లో మహిళా భద్రత, సాధికారతను పెంచేందుకు ఓ కమిటీని నియమించబోతున్నట్లు Manchu Vishnu ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ కమిటీకి 'వుమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్'(WEDC) అని పేరు పెట్టారు. 

MAA లో WEDC కమిటీని ఏర్పాటు చేయడం గర్వంగా ఉంది అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ కమిటీకి సామజిక కార్యకర్త సునీతా కృష్ణన్ గౌరవ సలహాదారుగా ఉంటారని విష్ణు పేర్కొన్నాడు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తా అని విష్ణు పేర్కొన్నాడు. 'మా'లో మహిళా సభ్యులని పెంచే దిశగా పనిచేస్తాం. అందులో WEDC తొలి అడుగు అని విష్ణు పేర్కొన్నాడు. 

టాలీవుడ్ లో మహిళా నటీమణులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు కూడా జరిగాయి. మంచు విష్ణు నియమించబోతున్న WEDC కమిటీ మహిళా నటీమణుల వేధింపులని అరికట్టే దిశగా పనిచేస్తుందేమో చూడాలి. 

Also Read: సీఎం స్టాలిన్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం.. శింబుపై భారీ కుట్ర అంటున్న తల్లిదండ్రులు

అక్టోబర్ 10న జరిగిన 'మా' ఎన్నికల్లో విష్ణు ప్రకాష్ రాజ్ పై 107 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. విష్ణు ప్యానల్ లో ఎక్కువమంది సభ్యులు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో కూడా కొందరు సభ్యులు విజయం సాధించినప్పటికీ.. Mohan Babu తమని దుర్భాషలాడారనే కారణంగా వారంతా మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios