త్వరలో హీరో మంచు విష్ణు సతీమణి విరోనికా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తమ భార్య గర్భవతిగా ఉన్న ఫోటోలని విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా విష్ణు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన భార్య డెలివరీ గురించి మాట్లాడాడు. అందాల చందమామ కాజల్ అగర్వాల్ తో తన భార్య డెలివరీ గురించి మాట్లాడగా ఆమె క్రేజీగా ఓ ఐడియా ఇచ్చినట్లు విష్ణు తెలిపాడు. తన భార్య నాల్గో కాన్పుని సోషల్ మీడియాలో లైవ్ ఇవ్వాలని కాజల్ కోరినట్లు మంచు విష్ణు తెలిపాడు. 

మంచు విష్ణు ట్వీట్ పై విరోనికా కూడా అంతే సరదాగా స్పందించింది. అలా చేస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తా అని కామెంట్ పెట్టింది. అంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటే వెనక్కి తగ్గక తప్పదు. ఎందుకంటే విరోనికకు తన తండ్రి మోహన్ బాబు సపోర్ట్ ఉందని విష్ణు తెలిపాడు.