మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చిరంజీవి భేటీ పర్సనల్ అని అన్నారు. దానిని అసోసియేషన్ మీటింగ్‌గా భావించకూడదని చెప్పుకొచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతితో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారని.. ఏపీలో తగ్గించారని చెప్పారు.కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారని తెలిపారు. అందుకే సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందకెళ్తామని చెప్పారు. రెండు ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు. చిరంజీవి, సీఎం జగన్ మీటింగ్‌కు సంబంధఇంచి మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించిన మంచు విష్ణు.. పర్సనల్ మీటింగ్‌ను అసోసియేషన్ మీటింగ్‌గా భావించకూడదని అన్నారు. సినీ ఇండస్ట్రీ అంతా పెద్ద కుటుంబం అని చెప్పారు.
సినిమా టికెట్ల ధరలు తగ్గించింది కరెక్టా..?, పెంచింది కరెక్టా..? అనేది లాంగ్ డిబేట్ అని అన్నారు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయని తెలిపారు. తాను విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేనని చెప్పారు. ఇండస్ట్రీ ఒక్కరిది కాదని.. ప్రతి ఒక్కరిది అని అన్నారు. స్వలాభం కోసం ఎవరూ కూడా పరిధి దాటి మాట్లాడొద్దన్నారు. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని అన్నారు.
తాను కూడా పరిధి దాటి మాట్లాడకూడదని అన్నారు. తనకు వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయని.. కానీ తాను ఉన్న పొజిషన్‌కు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదని అన్నారు. తాను ఏది మాట్లాడిని మా అసోసియేషన్ తరఫున మాట్లాడినట్టు అవుతుందని.. అది కరెక్ట్ కాదని చెప్పారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌తో అందరం చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు.
మా అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడతానని తెలిపారు. టికెట్లపై వైఎస్ హయాంలోనే జీవో వచ్చింది.. దానిపైనా చర్చ జరగాలి అన్నారు. తనను విమర్శిస్తున్నారంటే తాను పాపులర్ అని అర్థం అన్నారు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలో పలువురిని కలవబోతున్నారు కదా అని ప్రశ్నించగా.. అది మంచిదే కదా అంటూ బదులిచ్చారు.
ఇక, టాలీవుడ్ ముఖ్యులతో రేపు మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్‌తో భేటీకి సంబంధించిన వివరాలను చిరంజీవి వారికి వివరించనున్నారు. తదుపరి కార్యాచరణపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ భేటీకి ఒక్క రోజు ముందు విష్ణు చేసిన కామెంట్స్ హాట్ టాఫిక్‌గా మారాయి. జగన్‌తో చిరంజీవి భేటీని పర్సనల్ అనడం ద్వారా మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతుంది.
