సీనియర్ నటుడు మోహన్ బాబుకి రాజకీయాల్లో కూడా టచ్ ఉంది. అప్పుడప్పుడు పాలిటిక్స్ పై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు కలిసి శ్రీవిద్యానికేతన్ సంస్థల్ని విజయవంతంగా నడిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల మోహన్ బాబు ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్స్ విషయంలో చంద్రబాబుని నిలదీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి మాటలకు సపోర్ట్ ఇస్తూ మంచు విష్ణు చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

2017-2018 సంవత్సరాలకు గాను విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించలేదని మోహన్ బాబు చెప్పిన మాట నిజమని చెప్పారు మంచు విష్ణు. తన తండ్రి ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి మీడియా సమావేశం నిర్వహించారు. కానీ శాంతారాం ఇంజనీరింగ్ కళాశాలల అధినేత మాత్రం ప్రభుత్వానికి కొమ్ము కాశారని మంచు విష్ణు మండిపడ్డాడు.

ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు మంచు విష్ణు. ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్స్ టైంకి అందిస్తున్నామని చెప్పుకుంటోందని దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి తీరాలని డిమాండ్ చేస్తున్నాడు. 

 

photos లేడి గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చిన హీరోలు