కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు తనయులు సినిమాల్లో గత కొంత కాలంగా దారుణమైన  అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మనోజ్ సంగతి అటుంచితే అన్నయ్య విష్ణు మాత్రం సొంత బ్యానర్ లో దారుణమైన అపజయాలను అందుకున్నాడు. 

గతంతో పోలిస్తే విష్ణు మార్కెట్ డౌన్ కి వెళ్ళిపోయింది. అయినా కూడా ఈ యువ హీరో తగ్గడం లేదు. ప్రస్తుతం కన్నప్ప సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలోనే యాక్టర్ తనికెళ్ళ భరణి డైరెక్షన్ లో భక్త కన్నప్ప ఉంటుందని విష్ణు చెప్పాడు. 

దాదాపు 70కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది కాబట్టి మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న అనంతరం ఆ సినిమాను దైర్యంగా సెట్స్ పైకి తీసుకువద్దామని అనుకున్నాడు. కానీ అప్పటి నుంచే విష్ణు ఊహించని దెబ్బలు తిన్నాడు. తనకంటూ ప్రత్యేకంగా సెట్ చేసుకున్న మార్కెట్ నుంచి పూర్తిగా డౌన్ కి పడిపోయాడు. 

సినిమాలకు పెట్టిన బడ్జెట్ లో కనీసం సగమైనా వెనెక్కి రావడం లేదు. ఆచారి అమెరికా యాత్ర - గాయత్రి సినిమా నష్టాలు గట్టిగానే దెబ్బేశాయి. ఇక ఇప్పుడు ఎలాంటి దైర్యం లేని సమయంలో 70కోట్లను రిస్క్ చేసి ఖర్చు చేస్తున్నాడనిపిస్తోంది. మిథునం సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న తనికెళ్ళ భరణి కమర్షియల్ గా హిట్టయితే అందుకోలేదు.మరి భక్త కన్నప్పతో విష్ణుకి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.