ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. 

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా గెలిచినా వైఎస్ జగన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా తెలంగాణా సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ వేడుకకు మంచు విష్ణు దంపతులు కూడా హాజరయ్యారు. గురువారం ఉదయమే విజయవాడ చేరుకున్న విష్ణు తన భార్య విరానికతో కలిసి ఇందిరాగాంధీ స్టేడియంకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయ్యి జగన్ ఇంటికి వెళ్లే వరకు విష్ణు దంపతులు స్టేడియంలోనే ఉన్నారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన వైసీపీ అభిమానులు లైక్ లు కొడుతూనే ఉన్నారు. ఏపీ ఎన్నికలకు ముందు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో కొన్ని ఏరియాల నుండి ప్రచారం కూడా చేశారు. 

Scroll to load tweet…