Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు, మనోజ్ గొడవలో ఊహించని మలుపు.. త్వరలో రియాలిటీ షో అంటూ ట్విస్ట్, టీజర్ ఇదిగో

మంచు ఫ్యామిలిలో విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరిగుతోంది. ఊహించని విధంగా కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు..తన సన్నిహితులపై గొడవకు దిగుతున్నాడు అంటూ మనోజ్ షాకింగ్ వీడియో పోస్ట్ చేశాడు.

manchu vishnu announces  House of Manchu's Reality Show
Author
First Published Mar 30, 2023, 8:40 PM IST

మోహన్ బాబు తనయులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం బాగానే జరిగింది. వీరిద్దరూ కొన్ని హిట్ చిత్రాలు కూడా చేశారు. కానీ ఇటీవల మంచు ఫ్యామిలీకి సినిమాల పరంగా కలసి రావడం లేదు. అలాగే మనోజ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఒడిడుకులు ఎదుర్కొని ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నాడు. 

అయితే మంచు ఫ్యామిలిలో విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరిగుతోంది. ఊహించని విధంగా కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు..తన సన్నిహితులపై గొడవకు దిగుతున్నాడు అంటూ మనోజ్ షాకింగ్ వీడియో పోస్ట్ చేశాడు. కుటుంబ పరువు సమస్య కావడంతో మోహన్ బాబు ఆ వీడియో డిలీట్ చేయించారు. కానీ అన్నదమ్ముల వివాదం మీడియాలో సంచలన వార్తగా మారింది. మంచు ఫ్యామిలీ పరువు రచ్చకెక్కింది. 

అయితే అది ప్రతి కుటుంబంలో ఉండే సాధారణమైన వివాదమే అని మంచు ఫ్యామిలీ మెంబర్స్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ గొడవ నుంచి ప్రేక్షకుల ద్రుష్టి మరలుతున్న సమయంలో మంచు విష్ణు మరో ట్విస్ట్ ఇచ్చాడు. తన తమ్ముడితో గొడవపడుతున్నట్లుగా వైరల్ అయిన వీడియో ఫ్రాంక్ అని, ఓ రియాలిటీ షో కోసమే ఇదంతా అన్నట్లుగా విష్ణు తాజాగా ఓ టీజర్ రిలీజ్ చేశారు. 

ఈ టీజర్ లో వైరల్ అయిన వీడియో, దానిని మీడియా హైలైట్ చేసిన క్లిపింగ్స్.. అలాగే మంచు ఫ్యామిలీ లో జరుగుతున్న సంగతులు అన్నీ ఉన్నాయి. 'హౌస్ ఆఫ్ మంచూస్' పేరుతో విష్ణు ఈ రియాలిటీ షోని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారట. అన్నదమ్ముల గొడవ అంటూ ఇంత హంగామా జరిగింది ఈ రియాలిటీ షో కోసమే అన్నట్లుగా ఈ టీజర్ ఉంది. అయితే ఈ వీడియోలో ఎక్కడా మంచు మనోజ్ ప్రస్తావన లేదు. వీడియో మొత్తం విష్ణు అతని భార్య పిల్లలు, మోహన్ బాబు మాత్రమే ఉన్నారు. 

అయితే నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అన్నా ట్విస్ట్ అదిరింది.. అది అసలు ఊహించలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం పరువు పోయాక కవర్ డ్రైవ్ బాగానే చేస్తున్నారు. ఏ కాలం నాటి ఐడియా ఇది.. జనాలు అప్డేట్ అయ్యారు. ఇలాంటి కవర్ డ్రైవ్స్ నమ్మరు అంటూ మరికొందరు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. 

అసలే మీడియాలో ఈ వివాదం వల్ల పరువు పోయింది. ఇప్పుడు మీ అంతట మీరే ఆ పని చేస్తున్నారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచు విష్ణు చేస్తున్న ఈ ప్రయోగం ఫలితాన్ని ఇస్తుందో బెడిసికొడుతుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios