భారత ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారారు. జమ్మూ కాశ్మీర్ కు అనుకూలంగా ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి లేకుండా ఆ రాష్ట్ర పాలన మొత్తం కేద్రం చేతుల్లో ఉండేలా నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సమయం నుంచి జాతీయస్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో కాశ్మీర్ అంశం హాట్ టాపిక్ గా మారింది. 

మోడీ, షా ద్వయం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారనే ప్రశంసలు వెలువడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా కాశ్మీర్ విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కంగన రనౌత్, మధుర్ బండార్కర్, పరేష్ రావల్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. 

టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ఈ అంశంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడు. 'చరిత్ర సృష్టించబడిన రోజు ఇది.. జమ్మూ కాశ్మీర్ ప్రజల శాంతి, సంరక్షణకు ఇది మంచి నిర్ణయం. భారత్ మాతాకీ జై' అంటూ మంచు విష్ణు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించాడు.