ఇక్కడే ఉంటాడు..ఈ ఊళ్లలోనే ఉంటాడంటూ.. మంచు విష్ణు గెలుపుకోసం మోహన్‌బాబు ఓపెన్ లెటర్..
`మా` ఎన్నికలపై నాగబాబు, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, రోజా వంటి వారు స్పందించారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలని తెలిపారు. తాజాగా మంచు మోహన్‌బాబు స్పందించారు.
`మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తంగా `మా` ఇప్పుడు కామన్ ఆడియెన్స్ కి కిక్ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది. థియేటర్లో వినోదం పంచాల్సిన నటీనటులు చాలా వరకు ఇందులో భాగం కావడంతో అసలైన సిల్వర్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు `మా` ఎన్నికల్లో లభించబోతుంది.
maa electionపై నాగబాబు, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, రోజా వంటి వారు స్పందించారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలని తెలిపారు. తాజాగా మంచు మోహన్‌బాబు స్పందించారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, చిత్ర పరిశ్రమలో తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ తన కుమారుడు manchu vishnuని గెలిపించాలని తెలిపారు. `మా` అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న మంచు విష్ణు గెలుపుకోసం mohanbabu ఓపెన్ లెటర్ పంచుకున్నారు.
ఇందులో మోహన్‌బాబు మాట్లాడుతూ, `నేను మీ అందరిలో ఒకడిని. నటులతో పాటు నటుడ్ని, ప్రొడ్యూసర్లతోపాటు ప్రొడ్యూసర్‌ని, దర్శకత్వ శాఖలో పనిచేసినవాడిని, ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతిసారీ నేనున్నానని ముందు నిలబడ్డ దాసరి నారాయణరావు అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డని. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ చెప్పకూడదంటారు. కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించిన రోజు నుంచి, ఈ రోజు వరకు ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ ఎంతో మంది కొత్త కొత్త టెక్నీషియన్లని, కళాకారులను పరిచయం చేసేవాడిని.
మన 24క్రాఫ్ట్ల్ లో ఉన్న ఎంతో మంది పిల్లలకి, స్వర్గస్థులైన ఎంతో మంది సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి, వాళ్లు గొప్ప స్థానాలకు చేరేలా చేశాను. ఇక ముందూ కొనసాగిస్తాను. నేను `మా` అధ్యక్ష పదివిలో ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లు ప్రవేశపెట్టినవాడిని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. `మా` అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత.
ఈ సారి ఎన్నికల్లో నా కుమారుడు మంచు విష్ణు `మా` అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ విష్ణు మంచు.. నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు. నా కుమారుడు ఇక్కడే ఉంటాడు, ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కననిలబడి ఉంటాడని నేను మాటిస్తున్నా. కాబట్టి మీరు మీ ఓటుని మంచు విష్ణుతోపాటు పూర్తి ప్యానెల్‌కి కూడా వేసి ఒక సమర్థవంతమైన పాలనకు సహకరించాలని మనవి` అని తెలిపారు మోహన్‌బాబు.
also read: MAA Elections : నా ఓటు వాళ్లకే, కాంట్రవర్సీ విషయాలపై మాట్లాడను... రోజా కామెంట్స్
2021-23కిగానూ జరిగే `మా` ఎన్నికల కోసం అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇందులో ఎవరు గెలుస్తారనేది ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక అక్టోబర్ 10న `మా` ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రోజు సాయంత్రమే ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
related news: MAA Elections :ప్రకాష్ రాజ్ క్రమశిక్షణ లేని నటుడు, మంచు విష్ణుకే ఆ అర్హత ఉంది.. కోటా సంచలన కామెంట్స్