చిత్తూరి జిల్లాలో భక్తవత్సలంనాయుడిగా జన్మించిన మోహన్‌బాబు సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కళ, సినిమా పట్ల ఆసక్తితో, ప్యాషన్‌తో చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. 

కలెక్షన్‌ కింగ్‌గా, విలక్షణ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణిస్తున్న మంచు మోహన్‌బాబు రేపు(మార్చి 10) తన 69వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. చిత్తూరి జిల్లాలో భక్తవత్సలంనాయుడిగా జన్మించిన మోహన్‌బాబు సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కళ, సినిమా పట్ల ఆసక్తితో, ప్యాషన్‌తో చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. 

నటుడిగా నిలదొక్కుకునేందుకు హీరో, విలన్‌ అనే బేధం లేకుండా నటించారు. విలన్‌గా, హీరోగా, మళ్లీ విలన్‌గా, మళ్లీ హీరోగా ఇలా నటుడిగా తన రూపం మార్చుకుంటూ తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. తన అద్భుతమైన డైలాగ్‌ డెలివరీతో, అత్యద్భుతమైన నటనతో ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేశారు. ఇంకా చేస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. దీంతోపాటు విద్యావేత్తగా, అదే సమయంలో పేదరికంలోని పిల్లలకు ఉచితంగా విద్యని అందిస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నారు. 

నాలుగున్నర దశాబ్దాల సుధీర్ఘ సినీ కెరీర్‌లో ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించి, అనేక విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మోహన్‌బాబు. 2007లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ మధ్య ఆయన సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల తమిళంలో `సూరరై పోట్రు`(ఆకాశమే నీ హద్దురా) చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు `సన్నాఫ్‌ ఇండియా`లో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్బంగా బర్త్ డే సీడీని విడుదల చేశారు. `మా పెదరాయుడు`గారికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. ఇందులో మోహన్‌బాబు నటించిన సినిమాల్లోని పాత్రలు, ఆయన కలిసి ముఖ్యమైన వ్యక్తులున్నారు. ప్రస్తుతం ఈ బర్త్ డే సీడీపీ ట్రెండ్‌ అవుతుంది.