మంచు మనోజ్ గేమ్ షో.. ఫస్ట్ గెస్ట్ ఎవరు? టెలికాస్ట్ ఎప్పటి నుంచి... ఫుల్ డిటేయిల్స్.!
మంచు మనోజ్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. సరికొత్త గేమ్ షోతో రానున్నారు. ఇంతకీ గెస్ట్స్ ఎవరు? ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోందనే విషయాలను తెలుసుకుందాం....
కొంతకాలంగా యంగ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) సినిమాలకు దూరంగా ఉన్నారు. మౌనికా రెడ్డితో తన పెళ్లి తర్వాత మళ్లీ షురూ చేశారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటి చిత్రీకరణ శరవేగంగానే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మనోజ్ తన ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పారు. బుల్లితెరపైనా తన కొత్త గేమ్ షోతో అలరించబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఇటీవల ‘ఉస్తాద్’ (Ustaad) అనే టైటిల్ ను కూడా రివీల్ చేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మరియు ఈటీవీ (ETV Win) విన్ నుంచి ఈ రియాలిటీ గేమ్ షో రాబోతోంది. దీనికి మంచు మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ప్రోమో కూడా విడుదలైంది. సెలబ్రెటీలతో మాట్లాడుతూ ఆటలు ఆడించడం ఈ గేమ్ షో ప్రత్యేకత. అయితే ఈ గేమ్ షోకు సెలెబ్రెటీ గెస్ట్ లు ఎవరు? మంచు ఫ్యామిలీ నుంచి ఎవరైనా రానున్నారా? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఫస్ట్ గెస్ట్ ఎవరో గెస్ చేయండి అంటూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
దీంతో మనోజ్ ‘ఉస్తాద్ : ర్యాంప్ ఆడిద్దాం’ షోకు వచ్చే అతిథులపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ గెస్ట్ గా మాత్రం నేచురల్ స్టార్ నాని (Nani) రాబోతున్నారని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ (Hai Nanna) మూవీ ప్రమోషన్స్ కోసం ఈ సరికొత్త రియాలిటీషోకు రాబోతున్నారని అర్థమవుతోంది. అలాగే మాస్ మహారాజా రవితేజ, డైనమిక్ హీరో అడివి శేషు కూడా షోకు గెస్ట్ లుగా రాబోతున్నారు. ప్రస్తుతం వీరితో మనోజ్ షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది. అయితే ఫస్ట్ సీజన్ లో మంచు ఫ్యామిలీ వారెవరూ లేరని సమాచారం. నెక్ట్స్ సీజన్ లో ఉండే అవకాశం ఉండనుంది.
తొలిసారి మనోజ్ హోస్ట్ చేయబోతుండటంతో షో ఎలా ఆకట్టుకోబోతోందనే చూడాలి. మనోజ్ పై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్, ఆడియెన్స్ కూడా ఈ షోకోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. నెక్ట్స్ What The Fishలో నటిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుంది. మరో చిత్రం ‘అహం బ్రహ్మస్మి’లో నటిస్తున్నారు.