జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తన పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. బలమైన నేతలను కాకుండా మేధావులకు తన పార్టీలో చోటు కల్పిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నత విద్యలు చదువుకున్న వారు జనసేన పార్టీలో చేరారు. ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణురాజు, అబ్దుల్ కలాం సైంటిఫిక్ సలహాదారు పోన్ రాజ్, రిటైర్డ్ డీఐజీ రవికుమార్ ఇలా చాలా మందిని పవన్ తన పార్టీలోకి ఆహ్వానించాడు.

విద్యావంతులకు, మేధావులకు పార్టీలో స్థానం కల్పించడమనే విషయంలో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించాడు మంచు మనోజ్. ''ప్రజా సేవ చేయడానికి విద్యావంతుల సహాయం తీసుకుంటే దానికొక విలువ, అర్ధం ఉంటుంది. 

పవన్ కళ్యాణ్ సర్ చొరవ తీసుకొని వాళ్లపై నమ్మకం ఉంచి, గౌరవంతో జనసేన పార్టీలోకి తీసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది'' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన పవన్ అభిమానులు మంచి మనోజ్ కి కృతజ్ఞతలు తెలిపారు.