మంగళవారం నాడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో జరిగిన మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు మంచు మనోజ్.

ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు. తన సినిమా జూన్ లో ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. అలానే ఓటు హక్కు ప్రాధాన్యతను  వివరించారు.

ఈ మధ్యనే తాను కొన్ని మార్కెట్ లో జంతువుల ధరలు తెలుసుకున్నానని, మంచి గేదె దాదాపుగా రూ.80వేల ధర పలుకుతుందని చెప్పారు. మేక రూ.8 వేల వరకు ఉంటుందని,  పంది ధర రూ.3 నుండి 5 వేల వరకూ ఉందని తెలిపాడు.

మన ఓటు ధర రూ.500 నుంచి మహా అయితే రూ.5000 పలుకుతుందని.. అంటే మనం పందుల కంటే హీనమా..? అని ప్రశ్నించాడు. డబ్బుకి అమ్ముడిపోయి ఓటు వేయొద్దని సూచించాడు.