మీడియా కథనాలపై స్పందించిన మంచు మనోజ్, పరిశ్రమ నుండి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు. అలాగే వచ్చే సమ్మర్ నుండి తన కొత్త మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలియజేశారు.
సినిమాలకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారన్న వార్తలపై మంచు మనోజ్ స్వయంగా స్పందించారు.అలాగే మనోజ్ భవిష్యత్ ప్రణాళికలపై క్లారిటీ ఇచ్చారు. దీనితో మీడియాలో వెలువడుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి అక్క మంచు లక్ష్మితో కలిసి వెళ్లిన మనోజ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త వెంచర్స్ ప్రారంభిస్తున్నట్లు, వాటి ద్వారా యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
మనోజ్ కామెంట్స్ రీత్యా ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి, బిజినెస్ పై ద్రుష్టి పెడుతున్నాడని, ఆయన మాటల వెనుక సారాంశం ఇదేనంటూ వార్తలు వెలువడ్డాయి. మీడియా కథనాలపై స్పందించిన మంచు మనోజ్, పరిశ్రమ నుండి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు. అలాగే వచ్చే సమ్మర్ నుండి తన కొత్త మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలియజేశారు.
చాలా కాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న మంచు మనోజ్ 2019లో అహం బ్రహ్మస్మి పేరుతో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయిందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. సమ్మర్ లో అహం బ్రహ్మస్మి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజాగా మనోజ్ తెలియజేశారు. ఇక 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు చిత్రం తరువాత మనోజ్ హీరోగా మరో మూవీ విడుదల కాలేదు.
