మంచి మాస్ అండ్ కమర్షియల్ లుక్స్ ఉన్న యువ హీరోల్లో మంచు మనోజ్ కుమార్ ఒకరు. అయితే ఈ కుర్ర హీరో ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కెరీర్ లో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసిన తీవ్రంగా నీరాశపరుస్తున్నాయి. 

దీంతో ఒకానొక సమయంలో సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు అనే విధంగా ఆలోచనను రేకెత్తించాడు. ఆ తరువాత సినిమాలు చేస్తాను అంటూ మళ్ళీ గుడ్ న్యూస్ ఇచ్చాడు గాని ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్టు ఏమిటో చెప్పలేదు. మనోజ్ గత ఏడాది చివరలో ఒక్కడు మిగిలాడు అనే సినిమా తరువాత మరో సినిమా సెట్స్ పైకి తేలేదు. 

అయితే కొత్త ఏడాది ఎలాగైనా మంచి సబ్జెక్ట్ తో ముందుకు రావాలని సిద్దమవుతున్నట్లు సమాచారం. తండ్రి మోహన్ బాబు పుట్టినరోజును టార్గెట్ గా పెట్టుకొని మార్చ్ లో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చందు అనే దర్శకుడితో మనోజ్ ఒక సినిమా చేస్తాడు అని కథనాలు వచ్చాయి. అయితే ఆ సినిమా కంటే ముందే మనోజ్ ఒక సీనియర్ దర్శకుడితో వర్క్ చేసే అవకాశం ఉందని టాక్.