ఎప్పుడో స్వర్గస్తులైన నందమూరి హరికృష్ణ, నిన్న జరిగిన 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రారంభోత్సవంలో చిరంజీవితో పాటు కనిపించడం ఏంటని అనుకుంటున్నారా? దాన్ని మంచు మనోజ్ పోస్ట్ చేయడం ఏంటని కన్ ఫ్యూజ్ గా ఉందా? ఎవరో అభిమాని ఇలా ఓ ఫోటోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, అది అలా ఇలా పాకి మంచు మనోజ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ పిక్ ను తన ట్విట్టర్ ఖాతాలో మనోజ్ పోస్టు చేశాడు. ఈ పిక్ చూసేందుకు చాలా బాగుందని చెప్పాడు. సూపర్ టీమ్ 'ఆర్ఆర్ఆర్'కు శుభాభినందనలు తెలిపాడు. చిత్ర టీమ్ కు భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.