మంచు మనోజ్‌ సినిమాలకు దూరమై చాలా ఏళ్లు అవుతుంది. సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆయన కెమెరా ముందుకొచ్చారు. ఎట్టకేలకు కొత్త సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేశారు.

మంచు మనోజ్‌.. చాలా రోజుల క్రితం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఆయన చివరగా `ఒక్కడు మిగిలాడు` అనే చిత్రంలో నటించాడు. ఇది 2017లో వచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లలేదు. ఆదిలోనే ఆగిపోయాయి. దీంతో మంచు మనోజ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పి వ్యాపారాలు చూసుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో మనోజ్ లైఫ్‌లో చాలా జరిగింది. 

మంచు మనోజ్‌ తన మొదటి భార్యకి విడాకులిచ్చాడు. ఇటీవల మార్చిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనికా రెడ్డిని ఆయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే తన కొత్త సినిమాని ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో `వాట్‌ ది ఫిష్‌` అంటూ ఓ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. గేమింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. టైటిల్‌తో పాటు విడుద‌ల‌ చేసిన పోస్ట‌ర్‌లో మంచు మ‌నోజ్ వెన‌క్కి తిరిగి క‌నిపిస్తున్నాడు. పోస్ట‌ర్‌లో ఉన్న‌ కార్లు, బైక్‌లు మ‌నోజ్ నిల్చోన్న‌వైపు వ‌స్తోన్న‌ట్లుగా క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

టైటిల్‌తో పాటు `మ‌నం మ‌నం బ‌రంపురం` అనే క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంటోంది. తాను సినిమాల‌కు దూర‌మై చాలా కాల‌మైనా అభిమానులు ఇప్ప‌టికీ త‌న‌పై అదే ప్రేమ, ఆద‌ర‌ణ‌ను చూపిస్తుండ‌టం అదృష్టంగా భావిస్తున్నాన‌ని ఆ సందర్భంగా మనోజ్‌ తెలిపారు. ఈ సినిమాకు వ‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. డైరెక్ట‌ర్‌గా అత‌డికి ఇదే తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్‌ క‌థాంశంతో `వాట్ ద ఫిష్` సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. కెన‌డా, టొరంటోల‌లో 75 రోజుల పాటు షూటింగ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డిఫ‌రెంట్ లాంగ్వేజెస్‌లో షూట్ చేయ‌నున్న ఈ సినిమాను పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నట్టు చెప్పారు. 

ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ లేడు. ఉంటుందా? లేదా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఇన్నాళ్లకి మంచుమనోజ్‌ మళ్లీ కెమెరా ముందుకొచ్చినట్టు యూనిట్‌ తెలిపింది. ఈ సందర్బంగా ఓ ఫోటోని విడుదల చేసింది. ఇందులో కెమెరాకి మనోజ్‌ నమస్కరిస్తున్నారు. అయితే ఇది ఏ సినిమా షూటింగ్‌ కోస మనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనోజ్‌ కమిట్‌ అయిన వాటిలో నాలుగైదు ప్రాజెక్ట్ లున్నాయట. దీంతోపాటు ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో కూడా చేయబోతున్నారట. మరి వీటిలో ఏది ముందు స్టార్ట్ చేస్తారనేది తెలియాల్సింది. ఆ విషయాన్ని మాత్రం టీమ్‌ సస్పెన్స్ లో పెట్టింది. ఓ ప్లాన్‌ ప్రకారం ఆ సస్పెన్స్ ని రివీల్ చేయబోతున్నారట. మరి ముందు రియాలిటీ షో చేస్తారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తాయి. మనోజ్‌ పెళ్లి విషయంలోనే అన్న మంచు విష్ణు అలిగినట్టు సమాచారం. దీంతోపాటు ఆ తర్వాత తమ ఫ్యామిలీని మెంబర్స్ ని కొట్టడానికి విష్ణు వచ్చినట్టు ఓ వీడియోని పోస్ట్ చేశారు మనోజ్‌. దీంతో వారి ఫ్యామిలీలో ఉన్న విబేధాలు బయటపడ్డాయి. దీనికితోడు మోహన్‌బాబు ఆస్తుల పంపకాలు చేసేశాడట. మరోవైపు ఇటీవలే మోహన్‌బాబు, మంచు విష్ణు కలిసి తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్ `కన్నప్ప`ని స్టార్ట్ చేశారు. ఆ సమయంలో మనోజ్‌ కనిపించలేదు. ఇది కూడా వారి మధ్య గ్యాప్‌ ని తెలియజేస్తుంది. ఈ క్రమంలో మనోజ్‌ ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ముందుగా సినిమాతో వస్తాడా? రియాలిటీషోతో వస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.