మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజుల క్రితమే మంచు మనోజ్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి సోదరి కూడా కోవిడ్ బారిన పడింది.
పరిస్థితులు చూస్తుంటే కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలేలా కనిపించడం లేదు. ఇండియాలో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనితో సామాన్య ప్రజలతో పాటు సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారీన పడుతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా చిత్ర పరిశ్రమ మొత్తం సినీ తారలు ఒక్కొక్కరుగా కరోనాకి గురవుతున్నారు. ఇప్పటి వరకు అర్జున్ కపూర్, మంచు మనోజ్, విశ్వక్ సేన్, సీనియర్ హీరోయిన్ మీనా, ఏక్తా కపూర్ లాంటి సెలెబ్రిటీలు కరోనాకి గురైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కూడా కరొనకి గురయ్యారు.
తాజాగా మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజుల క్రితమే మంచు మనోజ్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి సోదరి కూడా కోవిడ్ బారిన పడింది. తనకు కోవిడ్ సోకడం పై మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్ పెట్టారు.
'బూచోడు లాంటి కరోనాకు దొరకకుండా రెండేళ్ల నుంచి తప్పించుకుంటున్నాను. కానీ ఎట్టకేలకు దొరికిపోయాను. నేను దానికి బాగా పోటీ ఇచ్చా. కానీ చివరకు దొరికిపోయా అని ఫన్నీగా తనకు పాజిటివ్ రావడంపై స్పందించింది.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకుని జాగ్రత్తగా ఉండండి అని అభిమానులకు సూచింది. తాను ఐసొలేషన్ లో ఉన్నాను కాబట్టి అభిమానులు తనకు మంచి సినిమాలు, షోలు సూచించాలని కోరింది.
మంచు లక్ష్మి ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తోంది.
