Asianet News TeluguAsianet News Telugu

Manchu Lakshmi : మోహ‌న్ లాల్ తో నటించడంపై మంచు లక్ష్మి అఫిషియల్ ప్రకటన!

గత కొద్ది రోజులుగా  ల‌క్ష్మీ.. మోహ‌న్ లాల్ భార్య‌గా క‌నిపించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విషయమై మంచు లక్ష్మి అఫీషియల్ గా స్పందించింది. సోషల్ మీడియా ద్వారా మంచు లక్ష్మి తాను మలయాళం సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రకటించింది.

Manchu lakshmi official on paired with Mohanlal
Author
Hyderabad, First Published Nov 15, 2021, 12:24 PM IST

మోహన్‌బాబు కుమార్తెగా చిత్ర పరిశ్రమకు పరిచయయ్యారు మంచు లక్ష్మి. యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ లో కూడా సినిమాలు చేసిన ఆమె మొదటి తెలుగు చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’. అందులో విలన్ ఐరేంద్రిగా నటించి అందరి ప్రశంసలూ అందుకోవడమే కాదు, ఉత్తమ విలన్‌గా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత ‘దొంగల ముఠా’, ‘చందమామ కథలు’, ‘గుండెల్లో గోదారి’, ‘దొంగాట’, ‘లక్ష్మీబాంబ్’​ సహా అనేక చిత్రాల్లో నటించారు. చివరిసారిగా పిట్టకథలు వెబ్​సిరీస్​లో కనిపించారు.హోస్ట్‌గా కూడా ప‌లు షోల‌తో అల‌రించిన మంచు లక్ష్మీ ప్ర‌స్తుతం ఆహాలో ఓ షో చేస్తుంది. ఇక అసలు విషయంలోకి వస్తే గత కొద్ది రోజులుగా  ల‌క్ష్మీ.. మోహ‌న్ లాల్ భార్య‌గా క‌నిపించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విషయమై మంచు లక్ష్మి అఫీషియల్ గా స్పందించింది.

సోషల్ మీడియా ద్వారా మంచు లక్ష్మి తాను మలయాళం సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రకటించింది. మోహన్ లాల్ మాన్స్టర్ పోస్టర్ ను షేర్ చేసిన మంచు లక్ష్మి సినిమా పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె.. ఫైనల్లీ క్యాట్ బ్యాగ్ నుండి బయటకు వచ్చేసింది. కొత్త భాష.. కొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నాను. చాలా ఎగ్జైట్ తో ఉన్నాను. నా మొదటి మలయాళ సినిమా అత్యంత ఇష్టమైన ప్రియమైన మోహన్ లాల్ తో చేయబోతున్నాను. ఈ సినిమా ను చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నాను.. అలాగే ఈ సినిమాను మీ ముందుకు తీసుకు వచ్చేందుకు చాలా ఇంట్రెస్ట్ తో కూడా ఉన్నట్లుగా మంచు లక్ష్మి పేర్కొన్నారు. సూపర్ స్టార్ తో మంచు లక్ష్మి చేయబోతున్న సినిమా లోని పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

చిత్రం వివరాల‌లోకి వెళితే మోహన్ లాల్ హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ తరహాలో ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్ లాల్ లక్కీ సింగ్‌గా సర్దార్జీ పాత్రలో కనిపించనున్నారు. మోహన్ లాల్ కుటుంబంతో మంచు మోహన్ బాబు కుటుంబానికి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ ఎంపిక జరిగిందని అంటున్నారు. మోహన్ లాల్ నటిస్తున్న ఈ చిత్రంలో మంచు ల‌క్ష్మీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట‌. అయితే మోహ‌న్ లాల్ భార్య‌గా మంచు ల‌క్ష్మీ న‌టిస్తున్న‌ట్టు వార్తలు వ‌స్తుండ‌గా, ఇందులో పూర్తి క్లారిటీ లేదు.  

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను 40 రోజులలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. మోహన్​లాల్​ త్వరలోనే ‘మరక్కర్’​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతోపాటే ఆరట్టు, రామ్​, బరోజ్​, బ్రో డ్యాడి, అలోన్​ సహా పలు సినిమాల్లో నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios