Asianet News TeluguAsianet News Telugu

వీరసింహారెడ్డిలో బాలయ్య పాటకు మంచు లక్ష్మీ మాస్ డాన్స్.. వీడియో వైరల్

మాస్ స్టెప్పుులతో మెస్మరైజ్ చేసింది మంచు లక్ష్మీ. మంచువారి ఆడపడుచు డాన్స్ వేయడం కొత్తకాదు.. కాని ఈసారి ఇంకాస్త డోస్ పెంచింది సీనియర్ బ్యూటీ. 

Manchu Lakshmi Mass Dance For Balayya Veera Simha Reddy Song
Author
First Published Jan 13, 2023, 8:19 AM IST

మంచువారి వారసత్వాన్ని పుచ్చుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. హాలీవుడ్ అవకాశాలు కూడా వదలుకుని టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. హీరోయిన్,విలన్, క్యారెక్టర్ ఆర్టిస్.. హోస్ట్.. ప్రొడ్యూసర్.. ఇలా మల్టీ అవతారాలెత్తి.. టాలెంట్ చూపిస్తోంది లక్ష్మీ.  మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓన్ ఇమేజ్ సాధించుకుంది  మంచు లక్ష్మీ. ఎన్ని చేసినా.. ఏ రంగంలోను స్ట్రాంగ్ గా నిలబడలేకపోయింది. 

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది మంచులక్ష్మీ. ఫిల్మ్ ఇండస్ట్రీకి సబంధించిన ప్రతీ విషయంలో స్పందిస్తుంటుంది లక్ష్మీ. వాటితో పాటు రీల్స్ చేస్తూ.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. తెగ హడావిడి చేస్తుంటుంది మంచువారి అమ్మాయి. ఇక తన నచ్చిన ఫేమస్ హిట్ సాంగ్స్ తో అప్పుడుప్పడు అలా షాకిస్తుంటుంది. రీసెంట్ గా అలాంటి ఓ సాంగ్ కు మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది మంచు లక్ష్మీ. 

 

అప్పుడప్పుడు డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ..అవి వైరల్ అవ్వడంతో  వార్తల్లో నిలుస్తుంది మంచు లక్ష్మీ. సంక్రాంతి కానుకగా ఈరోజు రిలీజ్ అయిన నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి  సినిమాలో ఓ పాటకు డాన్స్ చేసింది లక్ష్మీ. ఈమూవీలో మా భావ మనోభావాలు పాటకు అదిరిపోయేలా స్టెప్పులేసింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేసింది మంచు లక్ష్మీ. 

వీరసింహారెడ్డి మూవీ చూడటం  కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు  ఈ వీడియోతో పాటు రాసుకొచ్చింది మంచు లక్ష్మీ. ఇక ఈ  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. ఆమధ్య వాల్తేరు వీరయ్య పాటకు కూడా ఇదే విధంగా డాన్స్ చేసింది లక్ష్మీ. షూటింగ్ సెట్ లో.. రంగస్థలం మహేష్ తో పాటు డాన్స్ వేసింది. ఆ వీడియో కూడా నెట్టింగ హైలెట్ అయ్యింది. 

ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది మంచులక్ష్మీ.. ఎక్కువగా టాక్ షోలు చేస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో అవి కూడా తగ్గిపోవడంతో.. అప్పుడప్పుడు మాత్రమే తెరపై మెరుస్తోంది. రీసెంట్ గా మలయాళ స్టార్ సీనియర్ హీరో మోహన్ లాల్ నటించిన మాన్స్టర్ మూవీలో నటించింది మంచు. ఇక ఈ మూవీలో ఈమె లెస్బియన్ రోల్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా… 

Follow Us:
Download App:
  • android
  • ios