మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్‌లో జరిగిన ఘటనపై ఆమె ఫైర్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

మంచు లక్ష్మి సామాజిక స్పృహ కలిగిన మహిళా. నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా రాణిస్తుంది. ఇప్పుడు నటిగా మరోసారి మెప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవల మహిళలపై దాడులు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ మహిళని వేధించాడు పోలీస్‌. రక్షించాల్సిన పోలీసే ఆమెకి వేధించడం సభ్య సమాజాన్ని షాక్‌కి గురి చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతుంది. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో రాత్రి పూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అడ్డుకున్న పోలీసు, బలవంతం చేయబోయాడు. ఆ అమ్మాయిని లాగుతూ కనిపించాడు. పోలీస్‌ చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదలకుండా అసభ్యంగా ప్రవర్తించారు. చాలా సేపు శ్రమించి ఎట్టకేలకు ఆయన్నుంచి తప్పించుకుంది. 

ఈ ఘటనని దూరం నుంచి కొందరు సెల్‌ ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ట్రెండ్‌ అవుతుంది. ఈ వైరల్‌ వీడియోపై మంచు లక్ష్మి స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోని ట్యాగ్‌ చేస్తూ బ్లడ్‌ బాయిలింగ్‌(రక్తం మరుగుతుంది) అంటూ పోస్ట్ పెట్టింది. ఇది నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కంచే చేను మేస్తే ఇంకా ఎవరు రక్షించేదని, ఆడవారిని కాపాడాల్సిన పోలీసే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగడితే సాయం చేయమని ఇంకెవరిని అడగాలని మండి పడుతున్నారు నెటిజన్లు? ఇదే మన వ్యవస్థ తీరు? ప్రభుత్వాల తీరు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే మంచు లక్ష్మి ఇప్పుడు నటిగా మరోసారి మెప్పించేందుకు వస్తుంది. ఆమె ప్రస్తుతం `అగ్ని నక్షత్రం` చిత్రంలో నటిస్తుంది. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మెహన్‌బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని 'తెలుసా తెలుసా...' పాటను ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. 

YouTube video player

ఈ పాటలో లక్ష్మీ ప్రసన్న తో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ మంచు కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు.