మంచు లక్ష్మి విడాకులు తీసుకుంటుందా..? భర్తకు అందుకే దూరంగా ఉంటుందా? విడాకుల విషయంలో ఆమె క్లారిటీ ఏంటి? సరోగసి పిల్లల గురించి ఆమె ఏం చెప్పింది?
మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్
మంచు వారి వారసత్వాన్ని తీసుకుని మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది లక్ష్మీ ప్రసన్న. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ డమ్ రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. నిర్మాతగా, దర్శకురాలిగా, రైటర్ గా, హోస్ట్ గా మంచు లక్ష్మీ చేయని పని లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ తార.. తన ఇంగ్లీష్ తో ఇంకా పాపులర్ అయ్యింది. మంచువారి కుటుంబంలో మనోజ్ తప్పించి అందరు ట్రోల్స్ మెటీరియల్ గామాారారు. అందుల ముందుగా మంచు లక్ష్మీపైనే ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్వస్తి చెప్పి.. బాలీవుడ్ చేరింది మంచు లక్ష్మి.
Also Read: రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్, చేతిలో చిల్లి గవ్వలేక పవర్ స్టార్ ఏం చేశారంటే?
మంచు వారి ఇంట్లో ఆస్తి గొడవలు.
మోహన్ బాబు ఫ్యామిలీ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటుంది. సినిమా కాకుండా ఆస్తి వ్యవహారాలు, అన్నదమ్ముల గొడవలు అంటూ హడావిడి చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం చిన్న కొడుకు మంచు మనోజ్ తో పెద్ద గొడవ పెట్టుకుని ఆ తర్వాత మీడియా ముందు క్షమాపణలు చెప్పారు. ఆస్తి విషయం కోసమే పిల్లలు గొడవ పడ్డారని చెప్పలేదు కానీ చిన్న మాటల వల్ల జరిగిందని అంటున్నారు. కాని అసలు గొడవ ఏంటీ అనే ఫ్యామిలీ సీక్రెట్ బయట పెట్టడానికి వారు రెడీగా లేరు.
ఇక వారి ఆస్తి గొడవలు జరుగుతుండగా.. అవేమి పట్టించుకోకుండా మంచు లక్ష్మి ముంబయ్ లో ఉండిపోయారు.అయితే ఆమె ఎందుకు కల్పించుకోవడంలేదు. సర్దిచెప్పడంలేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇంతలో మరో బాంబ్ పేలింది సషల్ మీడియాలో. మంచువారి ఇంట్లో ఉన్న గొడవలు చాలవన్నట్టు మంచులక్ష్మీ విడాకులు తీసుకోబోతుందంటూ మరో వార్త వైరల్ అయ్యింది.
మంచు లక్ష్మి విడాకులు తీసుకోబోతోందా?
మంచు లక్ష్మి తన భర్తకు విడాకులు ఇవ్వబోతోంది అంటూ వార్తలు బయటకు రాగానే అలర్ట్ అయ్యింది ఆమె. ఇప్పటి వరకూ మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవలు చాలు అన్నట్టు.. ఇవేంటి కొత్తగా అనుకుంటూ.. తన వర్షన్ ను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆమె మాట్లాడుతూ.. 'నా భర్త శ్రీనివాస్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం కానీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధం. మేమిద్దరం సమాజంలో ప్రశాంతంగా ఉండే స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటాం. న్యూక్లియర్ ఫ్యామిలీలా బతుకుతున్నాం. స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత, బాధ్యతలకు మేము ప్రాధాన్యత ఇస్తాం. మాకు నచ్చినట్టు బతుకుతాం. వేరేవాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మా సంతోషాన్ని పాడు చేసుకోము. ఇప్పుడు మా కూతురు కూడా తండ్రితోనే ఉంది అన్నారు.
అనగనగా ఓ ధీరుడు, దొంగాట, గుండెల్లో గోదారి, చందమామ కథలు లాంటి చాలా సూపర్ హిట్ సినిమాల్లో లక్ష్మి నటించారు. అంతేకాదు తండ్రి సంపాదించిన ఆస్తిని పెంచుకుంటూ పోతున్నారు. చాలా చోట్ల ఇన్వెస్ట్ కూడా చేశారు. సినిమా చేయకపోయినా సినిమా రంగంలో యాక్టివ్ గా ఉండాలని స్పెషల్ క్యారెక్టర్లు, బుల్లితెర రియాలిటీ షోలు, ఫోటోషూట్ల ద్వారా లక్ష్మి యాక్టివ్ గా ఉంటారు. భర్త విదేశాల్లో ఉండటం వల్ల తన యూట్యూబ్ ఛానెల్‌లో ఏ వీడియో చేసినా కనిపించట్లేదు. మీ ఆయన ఇండియాకు వచ్చినప్పుడు ఒకసారి చూపించి క్లారిటీ ఇవ్వండి అని అభిమానులు అంటున్నారు.
Also Read: అడుగు పెడితే 1000 కోట్లు, 500 కోట్లకు తగ్గేదే లేదు, హీరోలకు సెంటిమెంట్ గా మారిన లక్కీ హీరోయిన్ ఎవరు?
ముంబయ్ లో ఉంటోన్న మంచు లక్ష్మి
ఇక ప్రస్తుతం ముంబల్ సెటిల్ అయ్యారు లక్ష్మి.టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది మంచు వారి ఆడపడుచు, మోహన్ బాబు కూతుర మంచు లక్ష్మి. టాలీవుడ్ లో తనకు సరైన అవకాశాలు రావడం లేదు అని ముంబయ్ కి షిప్ట్ అయిపోయింది. అక్కడ కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా.. వెబ్ సిరీస్ లు, టెలివిజన్, ఓటీటీ షోస్ చేసుకుంటుంది. ఎలాగైనా బాలీవుడ్ లో ఫేమస్ అవ్వాలని చూస్తోంది మంచు లక్ష్మి.
హైదారాబాద్ లో మంచు వారి ఇంట్లో పరిస్థితి ఎలా ఉండో అందరికి తెలిసిందే. మంచువారి అన్నతమ్ములు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి గొడవలు, మోహన్ బాబు కేసులు, ఇలా రచ్చ రచ్చ జరుగుతుంటే.. ఆమె మాత్రం ఇంత వరకూ వీటిపై స్పందించలేదు. హైదరాబాద్ కూడా వచ్చినట్టు కనిపించలేదు. మరి ఈ గొడవలో ఆమె ఏ తమ్ముడివైపు ఉంటారు అనేది కూడా తెలియడం లేదు. ఫ్యామిలీ అంతా వ్యతిరేకించినా.. తన చిన్న తమ్ముడు మనోజ్ పెళ్ళి ఆమె తన ఇంట్లో దగ్గరుండి చేయించారు.
Also Read: ఆ పాట ఎందుకు పాడానో అని బాధపడుతున్నా, శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు
