అయోధ్య బాలరాముడి విగ్రహా ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రెటీలు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక మంచు లక్ష్మి మాత్రం ఇలా చేసి ఆకట్టుకుంది.

Ayodhya Ram Mandir అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను దేశవ్యాప్తంగా హిందువులు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రత్యేక పూజలతో శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. సమీప ఆలయాల్లో రఘురాముడికి అభిషేకం, ఇతర పూజలను నిర్వహించి భక్తిని వ్యాపింపజేశారు. 

ఇక అయోధ్యలోని రామాలయం ప్రారంభోత్స వేడుకకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan, సురేఖ కొణిదెల, పవన్ కళ్యాణ్ Pawan Kalyanకు ఆహ్వానం అందింది. అలాగే బాలీవుడ్ తారలు, పలువురు రాజకీయ వేత్తలు ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్నారు. ఇక మిగిలిన వారంత తమ ఇళ్లలో, ఆలయాల్లో పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా స్టార్ కిడ్, నటి మంచు లక్ష్మి Manchu Lakshmi ఇంట్లోనే రాముడికి సేవలు చేసుకుంది. అయితే... అయోధ్య నుంచి బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంచు లక్ష్మి ల్యాప్ టాప్ లో వేడుకను తిలకిస్తూ రఘురాముడికి పూజలు నిర్వహించింది. పూలు సమర్పిస్తూ భక్తిని చాటుకుంది. 

ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో రామభక్తిని తెలియజేసేలా కొన్ని వ్యాఖ్యలు చెప్పింది. ‘నేటికి మార్గం సుగమం చేసిన ప్రతి హిందూ యోధుడికి కృతజ్ఞతలు ప్రతిధ్వనిస్తున్నాయి. 7000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న రామునిఉనికిని, భక్తిని శాశ్వతంగా ప్రేరేపిస్తూనే ఉంది. ఈ వారసత్వం దైవిక సారాంశం మన దేశాన్ని ఐక్యంగా బంధిస్తుంది.’ అంటూ పేర్కొంది. భక్తిని చాటుకున్న తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Scroll to load tweet…