Asianet News TeluguAsianet News Telugu

నీ యమ్మా అంటూ... సైమా ఈవెంట్లో వ్యక్తిని కొట్టిన మంచు లక్ష్మి, వీడియో వైరల్!

దుబాయ్ వేదికగా జరిగిన సైమా వేడుకల్లో మంచు లక్ష్మి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో ఆమె ఓ వ్యక్తిపై కోప్పడ్డారు. అతన్ని కొట్టారు. 
 

manchu lakshmi beats a person in siima event video goes viral ksr
Author
First Published Sep 21, 2023, 8:11 PM IST


ఇటీవల దుబాయ్ వేదికగా రెండు రోజులు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేదికలు జరిగాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన నటులు హాజరయ్యారు. అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకలకు మంచు లక్ష్మి హాజరయ్యారు. ఆమె వేదికపై వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. కాగా ఈవెంట్లో మంచు లక్ష్మి ప్రవర్తన ఆసక్తికరంగా మారింది. ఆమె ఓ వ్యక్తిని కొట్టారు. 

తెలుగు ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తుండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డుగా వచ్చాడు. వెంటనే రియాక్ట్ అయిన మంచు లక్ష్మి తప్పుకో అన్నట్లు అతని భుజం మీద కొట్టింది. నీ యమ్మా అంటూ అసహనం వ్యక్తం చేసింది. అంతలోనే మరొక వ్యక్తి కూడా అడ్డుగా వచ్చాడు. జంతువులను అదిలించే ఓ సౌండ్ చేసిన మంచు లక్ష్మి... మేము కెమెరా వెనకున్నాము. కొంచెం చూసుకోండి అని ఇంగ్లీష్ లో ఉన్నారు. 

ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. నిన్న మోహన్ బాబు కూడా ఇలానే ప్రవర్తించాడు. ఏఎన్నార్ శతజయంతి వేడుకలకు హాజరైన జయసుధ పక్కనే మోహన్ బాబు కూడా కూర్చున్నారు. ఆమె మొబైల్ చూసుకుంటుంటే... చేతిలో నుండి వేగంగా లాక్కునే ప్రయత్నం చేశాడు. ఏమీ అనలేక జయసుధ గమ్మునుండి పోయారు. ఈ రెండు వీడియోలను కంపేర్ చేస్తూ.. ఏమైనా మంచు ఫ్యామిలీ కొంచెం తేడా అంటున్నారు నెటిజెన్స్. 

మరోవైపు మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఆమె ప్రధానంగా తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అది. మోహన్ బాబు సైతం ఓ కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం. షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్నా అగ్ని నక్షత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఇక మంచు వారసులు విడిపోయారు. లక్ష్మి, మనోజ్ ఒకవైపు విష్ణు మరొకవైపు ఉన్నాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios