బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇటీవల అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తోన్న 'పించ్' అనే టీవీ షోలో పాల్గొంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్ లను వారికి చదివి వినిపించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు.

ఈ క్రమంలో కత్రినాని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. 'కత్రినా... నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్ లేకపోతే చచ్చిపోతాను.. నన్ను పెళ్లి చేసుకో.. నీ నెంబర్ ఇవ్వు'  అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ని కత్రినాకు చూపించగా ఆమె ఎమోషనల్ అయ్యారు.

ఈరోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఈరోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు.

ఈ సందర్భంలో కత్రినా తన పెళ్లిపై కూడా స్పందించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తెలియదు కానీ కచ్చితంగా చేసుకుంటాను. జీవితంలో ఏది ఊహించలేమని.. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదని చెప్పుకొచ్చింది.