తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్ గా హిందీలో 'కబీర్ సింగ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. 

ఈ సినిమాకు పని చేస్తున్న వారిలో రాము(30) అనే వ్యక్తి ఒకరు. డెహ్రాడూన్ లో ఓ జనరేటర్ కంపనీలో పని చేస్తుంటాడు. 'కబీర్ సింగ్' సినిమా షూటింగ్ కి సంబంధించి జనరేటర్ పనులు చూస్తుంటాడు.

నిన్న జనరేటర్ కి సంబంధించి ఆయిల్ ని చెక్ చేస్తున్న సమయంలో అతడు ముఖానికి కట్టుకున్న మఫ్లర్ జనరేటర్ లో ఇరుక్కోవడంతో ముఖానికి, తలకి బలమైన గాయాలు తగిలాయి.

వెంటనే హాస్పిటల్ కి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సినిమా షూటింగ్ ని నిలిపివేశారు. పోలీసుల  విచారణలో ఇది యాక్సిడెంట్ అని తేలడంతో బాడీని పోస్ట్ మార్టంకి తరలించారు.