కొందరు ఆడవాళ్లకు హద్దులు తెలియవు.. హీరోయిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్

Mamtha Mohandas Trolled In Social Media For Her Comments
Highlights

ఓ అమ్మాయిగా ఇలాంటి కామెంట్స్ ఎలా చేయగలవంటూ హీరోయిన్ మమతా మోహన్ దాస్ పై నెటిజన్లు ఫైర్ 

టాలీవుడ్ లో 'యమదొంగ','కింగ్' వంటి చిత్రాల్లో నటించిన మమతా మోహన్ దాస్ కొంతకాలం పాటు క్యాన్సర్ కారణంగా ఇండస్ట్రీకు దూరమయ్యారు. ఆ తరువాత కోలుకోవడంతో తిరిగి మళ్లీ  నటిగా తన కెరీర్ ను సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

అందంగా ఉన్న అమ్మాయిలపైనే అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ ఆమె చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏమందంటే.. ''ఎక్కువగా అందంగా ఉన్న ఆడవాళ్లపైనే అఘాయిత్యాలు జరుగుతుంటాయి. అందంగా ఉన్న అమ్మాయి సమాజంలో బతకడం కష్టం. అందంగా ఉందని ఆడవారి జీవితాలు సంతోషంగానే ఉంటాయి. వారు ప్రేమ, వృత్తి విషయాల్లో చక్కగా రాణిస్తున్నారు. ఓ మహిళ విషయంలో మగాడు తప్పు చేస్తున్నాడంటే.. ఆ విధంగా మహిళే అతడిని ప్రేరేపిస్తుందని నా అభిప్రాయం.

అలా అని అందరి జీవితాల్లో ఇలానే జరుగుతుందని చెప్పడం లేదు. ఇప్పటికీ కొందరు మహిళలకు హద్దులు తెలియవు. ఆడవాళ్లకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా ఎక్కువ. ప్రతిదానికి ఫీల్ అయిపోతుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలా చేసే ప్రతిసారి సమస్యల్లో ఇరుక్కుంటారు'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే మమతా చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆడదానివి అయిన నువ్వు సాటి ఆడవాళ్లను తప్పుబడుతూ ఎలా మాట్లాడతావ్ అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

loader