వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గత రాత్రి విడుదల చేసిన ఈ టీజర్ వైఎస్ అభిమానులను ఆకట్టుకుంటోంది.. విడుదలైన కొద్దిసేపట్లోనే ఇది ఇండియాలో టాప్ ట్రెండింగ్ అవుతోంది.
ప్రస్తుతం తెలుగునాట బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మహానటితో బయోపిక్‌లకు సరైన నిర్వచనం ఇచ్చింది టాలీవుడ్. దీంతో రాబోయే బయోపిక్‌ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైస్.రాజశేఖర్ రెడ్డిల జీవితకథలతో ఎన్టీఆర్, యాత్ర సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇవాళ వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
"తెలుసుకోవాలనుంది. వినాలనుంది. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలనుంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండె చప్పుడు వినాలనుంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా పట్టుదలో మూర్ఖత్వమో చరిత్రనే నిర్ణయించుకోనీ" అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో ఒక స్వరం వినిపిస్తుండగా టీజర్ కట్ చేశారు.
వైఎస్ రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఘట్టంగా చెప్పుకునే పాదయాత్రను హైలెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైఎస్‌గా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. సుహాసినీ, అనసూయ కీలకపాత్రలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాను 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ‘ఆనందోబ్రహ్మ’ ఫేమ్ మహి వీ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. గత రాత్రి విడుదల చేసిన ఈ టీజర్ వైఎస్ అభిమానులను ఆకట్టుకుంటోంది.. విడుదలైన కొద్దిసేపట్లోనే ఇది ఇండియాలో టాప్ ట్రెండింగ్ అవుతోంది.

