థియేటర్లు మూత పడటంతో ఓటీటీలకు డిమాండ్‌ పెరిగింది. ఓటీటీలో విడుదల చేసేందుకు చాలా సినిమాలు ముందుకొచ్చాయి. వస్తున్నాయి. ఇటీవల థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రావడం లేదు. దీంతో స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరో కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థ ప్రారంభం కానుంది. ఇప్పటికే అమేజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా, శ్రేయాస్‌ఈటీ తోపాటు మరికొన్ని చిన్నా చితకా ఓటీటీలు తెలుగులో రాణిస్తున్నాయి. అందులో భాగంగా మరో ఓటీటీని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.  ఫిలిమ్‌ అనే ఓటీటీ సంస్థ క్రేజీ సినిమాలతో తన జర్నీని ప్రారంభించబోతుంది. బలమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను, ఇండిపెండెంట్‌ సినిమాలను అందించబోతుంది. కామెడీ, డ్రామాస్‌, థ్రిల్లర్స్ వంటి డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలను ఆడియెన్స్ కి అందించేందుకు రెడీ అయ్యింది. 

ఈ `ఫిలిమ్‌` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విజయ్‌ సేతుపతి క్రైమ్‌ థ్రిల్లర్‌ `పిజ్ఙా 2`, `మమ్ముట్టి `రంగూన్‌ రౌడీ`, జె.డి చక్రవర్తి `మాస్క్`, నివిన్‌ పౌలీ-త్రిష ల `హే జూడ్‌` వంటి సినిమాలుఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్నాయి.