హోమో సెక్సవల్ పాత్రలో ముమ్మట్టి, ఆ దేశాల్లో బ్యాన్
ఈ చిత్రం రిలీజ్ కు కువైట్, ఖతర్ దేశాల్లో అయితే బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంట్ మూలాన అయితే ఈ చిత్రం రిలీజ్ కి ఆ దేశాల్లో బ్యాన్

డెబ్భయ్యేళ్ల వయసులోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ, సక్సెస్ లు అందుకుంటూ దూసుకువెళ్తూ మళయాళ మెగాస్టార్ ఇమేజ్‌ని నిలబెట్టుకుంటున్నారు మమ్ముట్టి. రీసెంట్ గా నటించిన “కన్నూర్ స్క్వాడ్” థియేటర్ లోనూ పెద్ద హిట్టే..ఇప్పుడు ఓటిటిలో వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటోంది. తెలుగులో అఖిల్ హీరోగా నటించిన‘ఏజెంట్’లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరో రెండు సినిమాల్ని లైన్‌లో పెట్టారు. వాటిలో ఒకటి ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ తీసిన జో బేబీ డైరెక్షన్‌లో. ఈ చిత్రాన్ని మమ్ముట్టియే నిర్మించనున్నారు. జ్యోతిక ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది. చిత్రం టైటిల్ “కాదల్ ది కోర్”. మరి ఈ చిత్రం ఈ నవంబర్ 23న అయితే రిలీజ్ థియేట్రికల్ గా రిలీజ్ కావడానికి సిద్ధం అయ్యింది.
తాజాగా ఈ చిత్రం రిలీజ్ కు కువైట్, ఖతర్ దేశాల్లో అయితే బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంట్ మూలాన అయితే ఈ చిత్రం రిలీజ్ కి ఆ దేశాల్లో బ్యాన్ చేసినట్టుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ముమ్మట్టి హోమో సెక్సువల్ ..గే పాత్రలో కనిపించారని అందుకే అక్కడ సెన్సార్ అభ్యంతరం చెప్పిందని వార్తలు వస్తున్నాయి.IFFI సినాప్సిస్ ప్రకారం ముమ్మట్టి ఓ రిటైర్డ్ కో ఆపరేటివ్ బ్యాంక్ అఫిషియల్ గా చేస్తూంటాడు. అతని పేరు జార్జి దేవసి.. అతను పంచాయితీ ఎలక్షన్స్ లో నిలబడదామనుకుంటాడుప. అయితే అతని రాజకీయ లక్ష్యాలు అతని సెక్సవల్ ఓరియెంటేషన్సో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్దితులు వస్తాయి. అతని భార్య Omana(జ్యోతిక) విడాకులకు అప్లై చే్తుంది. అక్కడనుంచి కథ చాలా కాంప్లిక్స్ గా జరుగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో మమ్ముట్టికి జ్యోతిక ఫిమేల్ లీడ్ లో నటించగా జో బేబీ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని మమ్ముట్టి మరియు వేఫారెర్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.
మరో ప్రక్క మమ్ముట్టి నటిస్తున్న 'భ్రమయుగం' (Bramayugam Movie) సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ నిర్మాతలు విడుదల చేశారు. రీసెంట్ గానే మేకర్స్ ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ పోస్టర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'భూతకాలం' మూవీ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో మమ్ముట్టి చాలా భయంకరంగా కనిపిస్తున్నారుమరోవైపు 'భ్రమయుగం' సినిమాతో పాటు మమ్ముట్టి మలయాళంలో 'బజూక' అనే సినిమా చేస్తున్నారు. డీనో డెన్నిస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గేమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. మమ్ముట్టి తో పాటూ గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.