Asianet News TeluguAsianet News Telugu

#Bramayugam: 'భ్రమయుగం' తెలుగు వెర్షన్ ఎప్పుడు?, ఓటిటి రిలీజ్ డేట్

భ్రమయుగం తెలుగు వెర్షన్‍పై సందిగ్ధత నెలకొంది.భ్రమయుగం చిత్రంలో మమ్మూట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. 

Mammootty Bramayugam to stream on this OTT platform jsp
Author
First Published Feb 18, 2024, 6:25 AM IST | Last Updated Feb 18, 2024, 6:25 AM IST


మొన్న శుక్రవారం రిలీజైన మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ సినిమా 'భ్రమయుగం' బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే. రిలీజైన రోజు నుంచి  ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ఆడియన్స్ వరకూ సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.   మమ్ముట్టి అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటూ  మీడియాలో చర్చ జరుగుతోంది. 'భూతకాలం' తీసిన రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రెండు రోజుల్లోనే పదమూడు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమాకు స్క్రీన్స్ పెంచుకుంటూ పోతున్నారు. 

పూర్తి బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ఈ సినిమా ..హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ ఇస్తోందని ఆడియన్స్ అంటున్నారు. తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎక్సపెక్ట్ చేసారు కానీ కాలేదు. అయితే ఇప్పుడు హిట్ టాక్ రావటంతో తెలుగు వెర్షన్ ని భారీగా రిలీజ్ చేద్దామనే ప్లానింగ్ లో నిర్మాతలు ఉన్నారట. ఈ మేరకు తెలుగు డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే హిట్ సినిమా అంత తేలిగ్గా ఓటీటిలో వస్తుందా...

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ  'భ్రమయుగం' చిత్రం  OTT రైట్స్ ని Sony LIV వారు సొంతం చేసుకున్నారు. తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ, హిందీ వెర్షన్స్ లలో రిలీజ్ చేస్తారు.  అయితే ఖచ్చితంగా ఓటిటిలో రిలీజ్ ఎప్పుడనేది తెలియలేదు. ఎగ్రిమెంట్ ప్రకారం సాధారణంగా థియేటర్ రిలీజ్ అయ్యిన 6-8 వారాల్లో సినిమా రిజల్ట్ చూసుకుని వదులుతారు. థియేటర్ రెవిన్యూ పూర్తైందనుకున్నాకే ఓటిటిలోకు వస్తుంది. 

మరో ప్రక్క భ్రమయుగం సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. ఫిబ్రవరి 23వ తేదీన ఈ చిత్రం తెలుగులో థియేటర్లలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అదేం లేదు, ఈ మూవీ తెలుగు వెర్షన్ డైరక్ట్ గా ఓటీటీలోకి వస్తుందని కూడా రూమర్లు వస్తున్నాయి.  భ్రమయుగం తెలుగు వెర్షన్‍పై సందిగ్ధత నెలకొంది.భ్రమయుగం చిత్రంలో మమ్మూట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొత్తం బ్లాక్‍ అండ్ వైట్ ఫార్మాట్‍లోనే వచ్చింది.

   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios