Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 14వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో అరవింద్ ఏంటి మాలిని అన్న మాటలకు బాధపడుతున్నావా అనగా నేనెందుకు బాధపడతాను బాబు గారు. అక్క తప్పు మాట్లాడలేదు కదా అక్క నాకోసమే చెప్పింది అని మల్లీ లోపల బాదను దాచుకొని బయటకు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. కాలేజీలో చుట్టూ ఉన్నారా లేదా అని చూడకుండా అక్కని పదేపదే అక్క అక్క అని పిలిస్తే వాళ్ళందరూ అక్కవైపు అదోలా చూశారు అందుకే అక్క నన్ను తిట్టింది అని మల్లీ అరవింద్ చెప్తూ ఉంటుంది. అప్పుడు అరవింద్ నిజంగా నువ్వు బాధపడడం లేదా అనగా లేదు అని అబద్ధాలు చెబుతుంది మల్లీ.
మీరందరూ నా గురించి నా చదువు గురించి కోరుకుంటున్నారు కాబట్టి పేపర్ కూడా రాని మా ఊరికి నేను పేపర్లో వచ్చేలా చేశారు అనుకుంటూ ఉంటుంది మల్లీ. అప్పుడు మల్లీ బాధతో మాట్లాడుతూ ఉండగా అరవింద్ ఓదారుస్తూ ఉంటాడు. వెల్లండి బాబు గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది. మల్లీ అరవింద్ నీ తోయడంతో అరవింద్ వెళ్లి మాలిని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకుంటుండగా అప్పుడు మాలిని అందరి ముందు అరుస్తావు ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఓదారుస్తావు.
నీ మనసులో చాలా ప్రేమ ఉంది అన్న విషయం నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు మాలిని అరవింద్ ని హత్తుకొని ముద్దు పెడుతుంది.
మరోవైపు మీరా దేవుడికి పూజ చేసి మొక్కుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి ప్రకాష్ కళ్ళు తాగి వస్తాడు. ఫుల్లుగా తాగి దేవుడనేవాడు లేదు దేవుడు ఉంటే నా మల్లి జీవితంలో నాశనం చేసేవాడు కాదు అంటూ వస్తాడు. అప్పుడు మీరా దేవుడిని మల్లీ గురించి కోరుకుంటుండగా ఇంతలో ప్రకాష్ అక్కడికి వచ్చి కింద పడిపోవడంతో మీరా షాక్ అవుతుంది. అప్పుడు మీరా ఏంట్రా ప్రకాష్ కి కొత్త అలవాట్లు ఏంటి అనడంతో బాధ అని అంటాడు.
అప్పుడు ప్రకాష్ ఏడుస్తూ ఉండగా అమ్మ గుర్తుకు వచ్చిందా అనగా కాదత్త మల్లి గుర్తుకు వచ్చింది అని అంటాడు. ఇప్పుడు కాదు అత్త మన మల్లీ కి ఎప్పుడు అన్యాయం జరిగింది అని అంటాడు ప్రకాష్. అప్పుడు మీరా కి ఏమీ అర్థం కాక ఏం మాట్లాడుతున్నావ్ ప్రకాష్ అని అడుగుతుంది.చెప్పు ప్రకాష్ అని గట్టిగా నిలదీయడంతో అరవింద్ బాబుకి మన మల్లీ తో కాకుండా ఇంకొక అమ్మాయితో కూడా పెళ్లి జరిగింది అనడంతో మీరా షాక్ అవుతుంది. ఆ ఇంట్లో మన మల్లీ కోడలుగా కాదు పని మనిషిగా బతుకుతోంది అని అంటాడు.
నువ్వు చెప్పేది నిజమాడంతో నీ మీద ఒట్టు అత్త అని అంటాడు. అప్పుడు మీరా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కలసి మల్లీ, మాలిని, అరవింద్ ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అరవింద్ మాలిని ఇద్దరు అక్కడికి వస్తారు. అప్పుడు మనిద్దరం కాదు ఉండు మల్లీ వస్తుంది వెళ్దాం ఆడడంతో వెంటనే రూపా మల్లీ లేదు సిటీ బస్సుకి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అని అంటుంది. ఎందుకు అలా చేసింది అత్తయ్య మాతో పాటు వచ్చేది కదా అని అంటుంది మాలిని. నిన్న నువ్వు చేసిన దానికి చాలా హర్ట్ అయినట్టుంది అని అంటాడు అరవింద్.
అప్పుడు నిన్న జరిగిన విషయాన్ని మర్చిపోండి హ్యాపీగా ఉండండి మాలిని కూడా నిన్న ఏదో కోపంలో అనింది అందుకే ఇప్పుడు మల్లీ బస్సుకి వెళ్ళింది అంటే బాధపడుతుంది అని అంటారు. అప్పుడు అరవింద్ కి మాలిని సారీ చెబుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు మీరా ప్రకాష్ ని నిద్ర లేపుతూ ఉండగా కాసేపు పడుకొని అత్త అని నిద్ర లేపుతూ ఉంటాడు ప్రకాష్. అప్పుడు మీరా జరిగిన విషయాలు అన్ని తలుచుకొని నీళ్లు తీసుకుని వచ్చి ప్రకాష్ ముఖం మీద కొడుతుంది. రేయ్ ఏంట్రా రాత్రి తాగి వాగావు ఏం చెప్పావు అనడంతో ఏం మాట్లాడాను అత్త అనగా అయితే గుర్తుంటావా నీకు అని అంటుంది. అప్పుడు ప్రకాష్ రాత్రి చెప్పిన మాటలు అన్నీ మీరా పూస గుచ్చినట్టు చెప్పడంతో ప్రకాష్ షాక్ అవుతాడు.
