#ManjummelBoys: తెలుగులోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. ని తెస్తున్న పవన్ డైరక్టర్, రిలీజ్ డేట్

 మంజుమ్మల్ బాయ్స్ ని కూడా తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. 

Malayalam Movie Manjummel Boys is all set to release in Telugu jsp

 
గత కొద్ది వారాలుగా మలయాళం సినిమాలు వరుస పెట్టి పెద్ది పెద్ద హిట్ అవుతున్నాయి. భ్రమయుగం, ప్రేమలు తర్వాత ఇప్పుడు రిలీజైన సర్వైవల్ థ్రిల్లర్  మంజుమ్మల్ బాయ్స్ కూడా పెద్ద హిట్టైంది. ఈ  సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం (ఫిబ్రవరి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీలాంటి వాళ్లు నటించిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావటం ప్లస్ అయ్యింది. దానికి తగినట్లు ఈ మూవీపై మొదటి నుంచే ఎక్సపెక్టేషన్స్ ఉండటంతో ఈ మంజుమ్మల్ బాయ్స్ ఓపెనింగ్స్ బాగున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాని తెలుగులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.

మొదటి ముమ్మట్టి ప్రధాన పాత్రలో నటించిన భ్రమయుగం సినిమాని తెలుగులోకి డబ్ చేసారు నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ థ్రూ రిలీజ్ చేసారు. అలాగే మరో మళయాళ యూత్ ఫుల్ డ్రామా ప్రేమలు చిత్రాన్ని మార్చి 8, 2024న తెలుగులోకి రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఈ మంజుమ్మల్ బాయ్స్ ని కూడా తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. మార్చి 15,2024న ఈ సినిమా రిలీజ్ కానుంది.   పాపులర్ తెలుగు దర్శక,నిర్మాత జాగర్లమూడి క్రిష్  ఈ చిత్రం తెలుగు రైట్స్ తీసుకుని విడుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

 క్రిష్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ బడ్జెట్ సమస్యలు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా ‘హరి హర వీరమల్లు’ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు. ఇక అనుష్క 50 చిత్రం ‘శీలావతి’ ని క్రిష్ డైరెక్ట్ చేయాలి. షూటింగ్ కి అంతా సిద్ధం అనుకున్న టైమ్ లో  ఈ డబ్బింగ్ సినిమాని రిలీజ్ కు పెట్టారు.  
 
ఇక ఈ సినిమాని  ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిని డైరెక్టర్ చిదంబరం మరింత ఇంట్రస్ట్ కలిగేలా షూట్ చేసారు. స్టోరీ లైన్ ఏంటంటే...2006లో కేరళకు చెందిన ఓ యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి తమిళనాడులోని కొడైకెనాల్ కు వెళ్లాడు. అక్కడి ఓ లోతైన గుహలోకి అతడు పడిపోతాడు. ఆ తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ అతన్ని ఎలా రక్షించారన్నది ఈ మూవీ స్టోరీ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios