మీటూ ఆరోపణలతో మొన్నటివరకు మలయాళం ఇండస్ట్రీ సౌత్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా లేడి యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి సంచనలనంగా మారింది. నయన్ సూర్యన్ అనే మహిళా దర్శకురాలు ఆమె ఇంట్లో విగత జీవిగా దర్శనమివ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

2017కి ముందు పలువురు సినీ దర్శకుల వద్ద శిష్యరికం చేసిన నయన్ ఒక సినిమాను కూడా తెరకెక్కించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఆమె హఠాన్మరణం సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నెలకొల్పింది. కేరళలో ఉన్న తన కూతురికి ఇటీవల తిరువనంతపురం నుంచి తల్లి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.

అయితే స్నేహితులను సంప్రదించడంతో వారు వెళ్లి చూడగా ఆమె అప్పటికే మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వివిధ రకాల అనుమానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు వారి విచారణ మొదలుపెట్టారు.