గత కొద్ది రోజులుగా కేరళ త్రిసూర్‌లోని జూబిలీ మిషన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ మలయాళ దర్శకుడు సాచీ ఇకలేరు. అయ్యప్పనమ్ కోషియమ్ లాంటి రికార్డు హిట్‌ను మలయాళ చిత్ర పరిశ్రమకు అందించిన సాచీ  చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూన్ 15న హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరగగా.. తొలి సర్జరీ సక్సెస్ అయిందని, కానీ రెండో సర్జరీ టైమ్‌లో హార్ట్ ఎటాక్ రావడంతో బ్రెయిన్ డామేజ్‌కు దారితీసిందని డాక్టర్లు వెల్లడించారు. 

కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు. అయితే చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన గురువారం రాత్రి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. పలువురు సీని ప్రముఖులు షాక్ గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. 
 
మాలీవుడ్ స్టార్స్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ కలయికలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తీసి బిగ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సాచి. క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన మూవీగా నిలిచింది. రచయితగా ఉన్న సాచి తొలిసారిగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా తెలుగు, హిందీ రీమేక్ హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయాయి. 

సాచీ అనార్కలి సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తన రెండో సినిమాగా అయ్యప్పనుమ్ కోషియమ్ అనే చిత్రాన్ని బిజూ మీనన్, ఫృథ్వీరాజ్‌తో కలిసి తెరక్కించారు. రూ.5 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది.